హీరో నాని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి అనిల్‌కుమార్ యాదవ్. నాని భజనపరుడని విమర్శించారు. సినిమా ఖర్చులో 80 శాతం రెమ్యునరేషన్‌కు వెళ్తుంటే, అసలు ఖర్చు 20 శాతమేనన్నారు. ఆ 80 శాతాన్ని ప్రేక్షకులపై రుద్దడం ఏంటని ప్రశ్నించారు. టికెట్ ధర తగ్గితే రెమ్యునరేషన్ తగ్గుతుందని వాళ్ళ బాధ అంటూ విమర్శించారు. భీమ్లా నాయక్ ,వకీల్ సాబ్ కి పెట్టిన ఖర్చెంతో చెప్పాలన్నారు. వకీల్‌సాబ్, భీమ్లానాయక్ తీసిన పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్ ఎంతో చెప్పాలన్నారు అనిల్‌కుమార్ యాదవ్. ప్రజలని ఉద్ధరిస్తానన్న పవన్ తక్కువ రేటుకే వినోదాన్ని పంచొచ్చు కదా.. అంటూ సెటైర్లు సంధించారు. తనకున్న క్రేజ్‌ను పవన్ అమ్ముకొంటున్నారని విమర్శించారు. ఒకప్పుడు నేను కూడా బైక్ అమ్మి పవన్ కళ్యాణ్ కి కటౌట్ లు కట్టానంటూ చెప్పుకొచ్చారు. ఉన్న డబ్బులు ఊడగొట్టుకొన్నా.. ఇప్పుడున్న అభిమానుల పరిస్థితి కూడా అంతే అంతే అంటూ హితవు పలికారు. ప్రొడక్షన్ కాస్ట్ 30 శాతం అయితే రెమ్యునరేషన్ 70 శాతం ఉంది.
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల వ్యవహారం… టీవీ సీరియల్‌ను తలపిస్తోంది. తరువాయి భాగం రేపు అన్నట్టుగా… రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ అంశం ఎటూ తేలకముందే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్మే బాధ్యతను ఎపీఎఫ్‌డీసీకి అప్పగించింది.
ఇవి కూడా చదవండి: ఈ అలవాట్లు మానుకోక పోతే మీకు వృద్దాప్యం ముందే వస్తుంది.. అవేంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..