AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్‎లో అపశృతి.. కూలిన కటౌట్.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. 

రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్‏లో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన కటౌట్ కూలిపోవడంతో

Radhe Shyam: రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్‎లో అపశృతి.. కూలిన కటౌట్.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. 
Prabhas
Rajitha Chanti
|

Updated on: Dec 24, 2021 | 11:42 AM

Share

రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్‏లో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన కటౌట్ కూలిపోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత సినిమా రాబోతుండడంతో రాధేశ్యామ్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో నిన్న హైద్రాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే వేడుక వద్ద ప్రభాస్, కృష్ణం రాజు భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 40 వేల మంది అభిమానులు వచ్చారు.

అయితే ఈవెంట్ జరుగుతున్న సమయంలో అభిమానులు కటౌట్స్ మీదికి ఎక్కారు. దాదాపు 40 మంది అభిమానులు ప్రభాస్ కటౌట్ మీదికి ఎక్కారు. నిర్వాహకులు ఎంత విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదు. దీంతో అభిమానుల బరువుకు కటౌట్ కూలింది. కటౌట్ మీద నుంచి కింద పడడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యని.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. రాధేశ్యామ్ ప్రీ రిలీజ ఈవెంట్‏కు దాదాపు వెయ్యి మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రభాస్ నుంచి సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జిల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో.. భారీ అంచనాలే ఉన్నాయి. హాలీవుడ్‌ మూవీ గ్లాడియేటర్‌కు యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ పనిచేయడంతో రాధే శ్యామ్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Radhe Shyam Trailer: ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా.. రాధేశ్యామ్ ట్రైలర్ అదుర్స్..

Thaggedhe Le: ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన క్రికెటర్ జడేజా.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా..

Pushpa: యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన శ్రీవల్లి సాంగ్‌.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి..

చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!