Bharathiraja : ఐసీయూలో డైరెక్టర్ భారతీరాజా.. ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన వైద్యులు.. ఎలా ఉన్నారంటే..
డైరెక్టర్ భారతీరాజా ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం మలేషియాలోని తన కుమార్తె ఇంటి నుంచి చెన్నైకి వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారింది. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఐసీయుూలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.

కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల మలేషియాలోని తన కూతురి ఇంటి నుంచి చెన్నై వచ్చిన తర్వాత ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం పరిస్థితి గురించి సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆయన ఐసీయూలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ పై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. ఆయన క్షేమంగా ఉన్నారని పేర్కొంటూ ఆయన కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం గురించి వ్యాపించే పుకార్లను నమ్మవద్దని కూడా వారు కోరారు.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
భారతీరాజా (84) తమిళ సినిమాలో పాపులర్ డైరెక్టర్. ’16 వయతినిలే’ చిత్రంతో తమిళ సినిమాలో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆయన అనేక విజయవంతమైన చిత్రాలను అందించారు. గత కొన్ని సంవత్సరాలుగా దర్శకుడిగా కాకుండా నటుడిగా పలు సినిమాల్లో నటిస్తున్నారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతేడాది భారతీరాజా ఏకైక కుమారుడు, నటుడు, దర్శకుడు మనోజ్ భారతీరాజా గుండెపోటుతో మరణించారు. దీంతో భారతీరాజా మానసికంగా కుంగిపోయారు. తన కుమారుడు మనోజ్ మృతి నుంచి కోలుకోవడానికి భారతీరాజా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా మలేషియాలోని తన కుమార్తె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చాడు. గత నెలాఖరులో అనారోగ్యం కారణంగా చెన్నైలోని MGM ఆసుపత్రిలో చేరారు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
తాజాగా భారతీరాజా ఆరోగ్య పరిస్థితికి సంబంధించి MGM హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని.. ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
