S Janaki Birthday: ఐదుతరాల హీరోయిన్లకు ఆలంబన జానకమ్మ స్వరం.. గానకోకిల పుట్టిన రోజు నేడు..

|

Apr 23, 2022 | 11:30 AM

S Janaki Birthday: ఆ మధురమైన పాటలు వింటే కోయిల గానం గుర్తుకొస్తుంది. కమ్మనైన పాటలకు నిలువెత్తు స్వరం.. ఆమె స్వరం ఉరికే జలపాతం. ఆమె గానం వీనుల విందు.. ఆమె గొంతులో సప్త స్వరాలు పలుకుతాయి..

S Janaki Birthday: ఐదుతరాల హీరోయిన్లకు ఆలంబన జానకమ్మ స్వరం.. గానకోకిల పుట్టిన రోజు నేడు..
S Janaki Birthday
Follow us on

S Janaki Birthday: ఆ మధురమైన పాటలు వింటే కోయిల గానం గుర్తుకొస్తుంది. కమ్మనైన పాటలకు నిలువెత్తు స్వరం..  ఆమె స్వరం ఉరికే జలపాతం. ఆమె గానం వీనుల విందు..  ఆమె గొంతులో సప్త స్వరాలు పలుకుతాయి. తన పాటలతో సంగీత ప్రియుల మనసులను “నీలి మేఘాలలో”  తేలిపోయేలా చేస్తుంది. తన సుస్వరాలతో “పగలే వెన్నెలను” పూయిస్తుంది. తన గాత్రంతో దక్షిణాది శ్రోతలను అలరించిన జిలిబిలి పలుకుల మైనా జానకమ్మ(S. Janaki) పుట్టిన రోజు నేడు.

ఎస్.జానకి గా అందరికి పరిచయమైన శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా (Guntur District) రేపల్లెలోని పాలపట్ల గ్రామంలో జన్మించింది. పుడుతునే మాటల కంటే పాటలను నేర్చిందీ గాన కోకిల. 1957 లో విధియిన్ విలయాట్టు అనే తమిళ సినిమాతో సినీ గాయనిగా కెరీర్ ను ప్రారంభించారు.  2016 సెప్టెంబర్ లో తాను పాటలను పాడడం ఆపేయనున్నానని ప్రకటించారు.  55 సినీ ప్రస్థానంలో దాదాపు 50,000 పైగా పాటలు పాడారు.  ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పాడారు. అయితే అచ్చతెలుగమ్మాయి మలయాళం, కన్నడ సినిమాల్లో ఎక్కువగా పాటలు పాడడం విశేషం. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారాలను అందుకున్నారు.

1969లో‌ జానకి‌ పి.బి. శ్రీనివాస్ తో కలిసి‌ ఒక‌ ఇంగ్లిష్ పాట పాడారు. ముఖ్యంగా జానకి ఇళయరాజా సంగీత దర్శకత్వంలో అనేక అద్భుతమైన పాటలకు జీవం పోశారు. నిజానికి ఎమ్.ఎస్. విశ్వనాథన్ తొలి దశలోనే‌ జానకితో ఎన్నో గొప్ప పాటలు తమిళ్లో పాడించారు. ‘నీ లీల పాడెద దేవా’ అంటూ జానకి ఆలపించిన ఈ పాటకు ఆమెకు తెలుగులో ఎనలేని క్రేజ్ తీసుకొచ్చింది.

సప్తస్వరాలకు మిమిక్రీ మిక్స్ చేసి.. తన పాటలతో సంగీత ప్రియులను అలరించిన గాన కోయిల.. కట్టు కథలు చెప్పి నేన్ను కవ్విస్తే.. అంటూ పండు ముసలిలా పడినా.. గోవుల్లు తెల్లన్న గోపయ్య నల్లన అంటూ ఆరేళ్ళ పసిబాలుడిగా పాడినా ఎవరికీ లేని ప్రత్యేకత నాది అని నిరూపించుకున్నారు జానకి. మేఘమా దేహమా అంటూ ఆర్ద్రత కురిపించినా, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది.. అంటూ ప్రేమని వెల్లడించినా.. వెన్నెల్లో గోదావరి అందం.. తో ఆవేదన వ్యక్తం చేసినా  తొలిసారి మిమ్మల్ని చూసింది అంటూ పాటలతో అల్లరి చేసే స్వరం.. ఎప్పటికీ మరవలేని ఓ సుస్వరం. అలనాటి జమున నుంచి నిన్నమొన్నటి హీరోయిన్ల వరకూ ఐదు తరాల హీరోయిన్లకి ఆలంబన జానకి స్వరం.. గాయనిగానే కాదు.. ఉషా కిరణ్ మూవీస్ వారి ‘మౌన పోరాటం’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.

Also Read: Vijayawada: కొన్న ఒక్కరోజులోనే ప్రాణం తీసింది.. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి వ్యక్తి మృతి.. మరో ముగ్గురు

AP Weather: ఏపీ వాసులకు అలెర్ట్.. 4 రోజులు పలు ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన