ప్రియుడిని పరిచయం చేసిన మెహ్రీన్.. వైరల్ అవుతున్న ట్వీట్.. ఇక సినిమాలకు స్వస్తి పలికినట్లేనా.!!
Mehreen Kaur Pirzada Engaged: టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత....

Mehreen Kaur Pirzada Engaged: టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడైన కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయిని పెళ్లాడబోతోంది. వీరిద్దరికి సంబంధించిన వార్తలు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తాజాగా మెహ్రీన్ తనకు కాబోయే భర్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేసింది. ఈరోజు అతడి పుట్టినరోజు కావడంతో ట్విట్టర్ ద్వారా ఈ భామ విషెస్ తెలిపింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
కాగా, మెహ్రీన్- భవ్య బిష్నోయిల నిశ్చితార్థ వేడుక మార్చి 13న రాజస్థాన్‌లోని జైపూర్ అలీలా కోటలో ఘనంగా జరగనుంది. తెలుగుతో పాటు తమిళం, పంజాబీ చిత్రాల్లో నటించిన మెహ్రీన్.. పెళ్లి తర్వాత సినిమాలను గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం.
మరిన్ని చదవండి:
‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..
ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…
భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!
View this post on Instagram
