Director Sukumar : శిష్యుడిపై ఉప్పెనంత ప్రేమ కురిపించిన సుకుమార్.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్..
టాలీవుడ్‌లో టాలెంటడ్ డైరెక్టర్స్ లో ముందు వరుసలో ఉండే దర్శకుడు సుకుమార్.. ఈ లెక్కల మాస్టర్ సినిమాలకోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు...

Director Sukumar : టాలీవుడ్‌లో టాలెంటడ్ డైరెక్టర్స్ లో ముందు వరుసలో ఉండే దర్శకుడు సుకుమార్.. ఈ లెక్కల మాస్టర్ సినిమాలకోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ సినిమా తెరకెక్కిస్తున్నాడు సుక్కు. కాగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకుడిగా పరిచయం అయిన సినిమా ‘ఉప్పెన’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన మంచి విజయాన్ని సొంతంచేసుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాతో మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు.
ఇదిలా ఉంటే ‘ఉప్పెన’ సినిమా విషయంలో మొదటినుంచి తన శిష్యుడిపై ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నాడు సుకుమార్. ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా బుచ్చిబాబుని తన శిష్యుడని గర్వంగా చెప్పుకుంటా అని అన్నాడు సుక్కు. ఉప్పెన సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని, 100కోట్ల సినిమా అవుతుందని రిలీజ్ కు ముందే చెప్పేసాడు సుకుమార్. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది ఉప్పెన. తాజాగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా పై సుకుమార్ కవిత రూపంలో మరోసారి తన ప్రేమను చాటారు. ” నువ్వు నన్ను గురువుని చేసేసరికి నేను నీకు శిష్యుడినైపోయాను…ఇంత గొప్ప సినిమా తీయడానికి నువ్వు నాదగ్గర ఏం నేర్చుకున్నావా ..? అని నాకు నేను శిష్యుడిని అయిపోతే తప్ప అదేంటో తెలుసుకోలేను..నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సా’నా’ బుచ్చిబాబును ‘ఉప్పెనంత’ ప్రేమతో అభినందిస్తూ..ఇట్లు సుకుమార్ ఇంకో శిష్యుడు సుకుమార్”. అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసారు.
View this post on Instagram




