AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణవంశీ డైరెక్షన్‏లో ‘అతిలోకసుందరి’ కూతురు.. ఫీమేల్ ఒరియంటెడ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ?

సినీ ఇండస్ట్రీలో ఆయన తీసే సినిమాలు వైవిధ్యంగా ఉంటాయి. సినిమా తెరకెక్కించే ముందు ఆయన ప్రతి చిన్న విషయానికి ప్రాధాన్యత ఇస్తుంటారు.

కృష్ణవంశీ డైరెక్షన్‏లో 'అతిలోకసుందరి' కూతురు.. ఫీమేల్ ఒరియంటెడ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ?
Rajitha Chanti
|

Updated on: Feb 16, 2021 | 7:05 PM

Share

Krishna Vamsi New Movie Update: సినీ ఇండస్ట్రీలో ఆయన తీసే సినిమాలు వైవిధ్యంగా ఉంటాయి. సినిమా తెరకెక్కించే ముందు ఆయన ప్రతి చిన్న విషయానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. క్రియేటివ్‏గా సినిమాలను రూపొందించడంలో ఆయనే దిట్ట. అందుకే ఆయనకు చాలా మంది అభిమానులున్నారు. ఆయనేవరో కాదు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి ఈయనకు సరైన్ హిట్ రావట్లేదు. రామ్ చరణ్‏తో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తీసినా.. అది అంతగా హిట్ కాలేకపోయింది. తాజాగా కృష్ణ వంశీ మహిళా ప్రాధాన్యం ఉన్న కథతో ఓ సినిమా తెరకెక్కించనున్నట్లుగా టాక్. అయితే ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తే.. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‏ను ఎంపిక చేయనున్నట్లుగా ఫీల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది.

లాక్ డౌన్ సమయంలోనే ఓ కథను కృష్ణవంశీ సిద్ధం చేసుకున్నారట. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని సమాచారం. అయితే అటు బాలీవుడ్‏లో గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గర్ల్ వంటి ఫీమేల్ ఓరియంటేడ్ సినిమాల్లో నటించిన జాన్వీకపూర్ అయితే ఈ స్టోరీకి సరిగ్గా సరిపోతుందని కృష్ణవంశీ భావిస్తున్నాడట. ఇప్పటికే జాన్వీ తండ్రి బోనీకపూర్‏తో చర్చించారట. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదట. ఇక బోనీ కపూర్ నిర్మాతగా హిందీలో కృష్ణవంశి డైరెక్షన్లో శక్తి, ది పవర్ అనే సినిమాలు తెరకెక్కించారు. ఈనేపథ్యంలోనే జాన్వీ కపూర్‏ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ఛాన్స్ కృష్ణవంశీకే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. అటు జాన్వీ కూడా ‘గుడ్ లక్ జెర్రీ’, ‘రూహి’, ‘దోస్తానా 2’ లాంటి సినిమాల్లో నటిస్తుంది.

Also Read: అచ్చం అమ్మలాగే : అతిలోక సుందరిని తలపించిన జాన్వీకపూర్‌ తాజా ఫోటోలు