ఓటీటీ ప్లాట్ ఫామ్ లపై చర్యకు యోచన, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం, 6 వారాల గడువునిచ్చిన న్యాయస్థానం

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్ ల నియంత్రణకు సంబంధించి ఏదో ఒక చర్య తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామని కేంద్రం..సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఓటీటీ ప్లాట్ ఫామ్ లపై చర్యకు యోచన, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం, 6 వారాల గడువునిచ్చిన న్యాయస్థానం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 16, 2021 | 7:49 PM

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్ ల నియంత్రణకు సంబంధించి ఏదో ఒక చర్య తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామని కేంద్రం..సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓటీటీ రెగ్యులేషన్ ని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన పిల్ ను  కోర్టు విచారించింది. దీనిపై 6 వారాల్లోగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు.. కేంద్రాన్ని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ఎస్.ఏ. బాబ్డే, న్యాయమూర్తులు ఎ.ఎస్.బోపన్న, వి. రామసుబ్రమణ్యన్ లతో కూడిన బెంచ్ దీన్ని విచారించింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ వాదించారు.  ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోగోరుతోందంటూ  మొదట పెండింగ్ పిటిషన్ తో ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్ ను కోర్టు ట్యాగ్ చేసింది.  6 వారాల గడువును ప్రభుత్వానికి ఇచ్చింది. శశాంక్ శేఖర్ ఝా, అపూర్వ అర్హటియా అనే లాయర్లు ఈ పిల్ ను దాఖలు చేశారు.

దేశంలో సినీ థియేటర్లు ఇప్పట్లో పూర్తిగా తెరుచుకోని నేపథ్యంలో ఓటీటీ  స్ట్రీమింగ్, డిఫరెంట్ డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ లు సెన్సార్ బోర్డు నుంచి ఎలాంటి క్లియరెన్స్ సర్టిఫికెట్లు లేకుండానే చిత్ర నిర్మాతలు లేదా ఆయా సిరీస్ మేకర్స్ తమ చిత్రాలను, సిరీస్ లను ఈ ప్లాట్ ఫామ్ లలో రిలీజ్ చేస్తున్నారని, అసలు దీనికి చట్టం గానీ లేదా .. ఓ నియంత్రణ గానీ  అంటూ ఉందా అని పిటిషన్ దారులు ప్రశ్నించారు.

మరిన్ని చదవండి ఇక్కడ : Snake cross Road Video : రోడ్ క్రాస్ చేసిన భారీ పాము..అరగంట నిలిచిన ట్రాఫిక్..వైరల్ అవుతున్న వీడియో