AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్న సర్కారు వారి పాట టీమ్.. ఆ రోజున సినిమా అప్డేట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజాచిత్రం సర్కారువారి పాట . గీతగోవిందం ఫేమ్  పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్న సర్కారు వారి పాట టీమ్.. ఆ రోజున సినిమా అప్డేట్..
Rajeev Rayala
|

Updated on: Apr 26, 2021 | 3:33 AM

Share

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజాచిత్రం సర్కారువారి పాట. గీతగోవిందం ఫేమ్  పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తతం దుబాయ్ లో ఈ సినిమాచిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తుంది. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్తగా కనిపించనున్నాడు. ఇప్పటికే మహేష్ న్యూ స్టైల్ నెట్టింట వైరల్ అవుతుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది.

ఇప్పటికే దుబాయ్‌ లో సెకండ్‌ షెడ్యూల్‌ షూట్‌ని స్టార్ట్‌ చేసిన ఈ టీం.. ఫిబ్రవరి 21 నాటికి ఆ షూట్‌ను పూర్తి చేసి హైదరాబాద్‌కు చేరుకుంటుందట. అలా పూర్తి చేసుకున్నాక అక్కడ షూట్‌ విశేషాలను కలిసి ఓ వీడియోగా అభిమానుల కోసం రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట. ఫిబ్రవరి 25న ఈ మేకింగ్  వీడియో రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్లో ఉండగానే భారీగా ప్రిరిలీజ్‌ బిజినెస్‌ చేసిందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. సరిలేరు  సినిమా తరువాత మహేష్‌ ఈ సినిమా చేస్తుండడం. అందులోనూ.. గీతాగోవిందం వంటి ఇండస్ట్రీ హిట్టు తరువాత పరుశురామ్‌.. డైరెక్ట్‌లో తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టే ప్రి రిలీజ్‌ బిజినెస్‌ చేస్తూ.. ఈ సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

వరుస సినిమాలను స్టార్ట్ చేస్తున్న ‘గాలి సంపత్’.. కొత్త సినిమా టైటిల్‏ను అనౌన్స్ చేసిన యంగ్ హీరో..