Chiranjeevi: ”లైగర్” టీమ్‌కు మెగా విషెస్.. నాకౌట్ పంచ్ అదిరిపోవాలన్న మెగాస్టార్
LIGER : అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు లైగర్(Liger)గా గర్జించడానికి రెడీ అయ్యాడు విజయ్. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఈ క్రేజీ హీరో నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ అనన్య హీరోయిన్ గ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. లైగర్ అనే వెరైటీ టైటిల్ అనౌన్స్ చేసి అటెన్షన్స్ క్రియేట్ చేశారు పూరి. ఇక ఇప్పుడు అదే రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తూ హంగామా చేస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు లైగర్ టీమ్. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిశారు. ‘గాడ్ ఫాదర్’సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవితో పాటు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కూడా కలిశారు లైగర్ టీమ్. ఇక తాజాగా రేపు(ఆగస్టు 25న) లైగర్ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి లైగర్ టీమ్ కు విషెస్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చిత్రయూనిట్ కు విషెస్ తెలుపుతూ.. మీలాగే ఇండస్ట్రీ కూడా దీన్ని ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుంది! నాకౌట్ పంచ్ ఇవ్వండి!! అంటూ ట్వీట్ చేశారు. మెగాస్టార్ విషెస్ తెలుపడంతో చిత్రయూనిట్ ఆనందం లో తేలిపోతున్నారు.




It’s #Liger Day Tomorrow!
Wishing Dearest @purijagan @TheDeveraKonda @meramyakrishnan @karanjohar @Charmmeofficial @ananyapandayy & the Entire Team, All The Very Best for a Memorable Success!
It will be relished as much by the Industry as you all! Go for the Knockout Punch!! pic.twitter.com/XDsVLt4aT0
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 24, 2022




