Megastar Chiranjeevi: మదర్స్‌ డే స్పెషల్‌.. అంజనమ్మతో మధుర క్షణాలను గుర్తుచేసుకున్న మెగా బ్రదర్స్..

Mothers Day 2022: మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ మాతృమూర్తుల సేవలను స్మరించుకుంటున్నారు.

Megastar Chiranjeevi: మదర్స్‌ డే స్పెషల్‌.. అంజనమ్మతో మధుర క్షణాలను గుర్తుచేసుకున్న మెగా బ్రదర్స్..
Megastar Chiranjeevi

Updated on: May 08, 2022 | 3:02 PM

Mothers Day 2022: మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ మాతృమూర్తుల సేవలను స్మరించుకుంటున్నారు. వారితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈక్రమంలో మదర్స్‌డే (Mothers Day 2022) సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) ఓ అరుదైన వీడియోను షేర్‌ చేసి ‘అమ్మలందరికీ అభివందనములు’ అంటూ తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక చిరంజీవి షేర్‌ చేసిన వీడియోలో తన తల్లి అంజనా దేవి, సోదరులు పవన్‌ కల్యాణ్‌, నాగబాబులు కూడా ఉన్నారు. ఓ సినిమా షూటింగ్‌ లోకేషన్‌లో తన కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన క్షణాలను ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఈ వీడియోకు ప‌వ‌న్ హీరోగా న‌టించిన వకీల్ సాబ్ సినిమాలోని మగువ మగువ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా ఉప‌యోగించారు.

ఆచార్య తర్వాత చిరంజీవి నటిస్తోన్న చిత్రం గాడ్‌ ఫాదర్‌. మలయాళం సూపర్‌ హిట్‌ లూసీఫర్‌కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ లో జరిగింది. ఈ షూటింగ్‌ స్పాట్‌కి సమీపంలోనే పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన భీమ్లానాయక్‌ సినిమా షూటింగ్‌ కూడా జరిగింది. ఈక్రమంలో సినిమాలతో బిజీగా ఉండే చిరు- పవన్‌ ఇద్దరూ ఒకే చోట ఉండటంతో అంజనాదేవి, నాగబాబు లొకేషన్‌కి చేరుకున్నారు. అక్కడికి అంజ‌న‌మ్మ రాగానే మెగాబ్రదర్స్‌ సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. ఆమెతో క‌లిసి భోజ‌నం చేశారు. ఆ త‌ర్వాత కాసేపు ముచ్చటించారు. ఆ త‌ర్వాత ఆమెను కారులో సాగ‌నంపారు. వాన‌ప‌డుతుంటే అంజ‌న‌మ్మకు చిరంజీవి గొడుగు ప‌ట్టగా, ప‌వ‌న్ తన తల్లిని జాగ్రత్తగా ప‌ట్టుకుని న‌డిపించుకుంటూ కారు వ‌ర‌కు తీసుకెళ్లారు. ఈ వీడియోనే మదర్స్‌ డే సందర్భంగా షేర్‌ చేశారు చిరంజీవి. కాగా ఈ వీడియో అభిమానులతో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. హ్యాపీ మదర్స్‌డే అంటూ లవ్‌, హార్ట్‌ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: