AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: గరికపాటి వ్యాఖ్యలపై మొదటిసారి స్పందించిన మెగాస్టార్‌.. వివాదానికి ముగింపు పడినట్లేనా?

ఇటీవల నిర్వహించిన గాడ్‌ఫాదర్‌ సక్సెస్‌మీట్‌లోనూ కొందరు సినీ ప్రముఖులు గరికపాటిపై ఘాటుగా మాట్లాడారు. అయితే ఇప్పటివరకూ ఈ వివాదంపై స్పందించిన మెగాస్టార్‌ తాజాగా పెదవి విప్పారు. వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.

Chiranjeevi: గరికపాటి వ్యాఖ్యలపై మొదటిసారి స్పందించిన మెగాస్టార్‌.. వివాదానికి ముగింపు పడినట్లేనా?
Garikapati, Chiranjeevi
Basha Shek
|

Updated on: Oct 13, 2022 | 4:21 PM

Share

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవిని ఉద్దేశిస్తూ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. మెగాబ్రదర్‌ నాగబాబుతో పాటు అభిమానులు గరికపాటి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇటీవల నిర్వహించిన గాడ్‌ఫాదర్‌ సక్సెస్‌మీట్‌లోనూ కొందరు సినీ ప్రముఖులు గరికపాటిపై ఘాటుగా మాట్లాడారు. అయితే ఇప్పటివరకూ ఈ వివాదంపై స్పందించిన మెగాస్టార్‌ తాజాగా పెదవి విప్పారు. వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.గాడ్‌ఫాదర్‌ సక్సెస్‌మీట్‌లో భాగంగా విలేకర్లతో మాట్లాడిన చిరంజీవి.. ‘గరికపాటి పెద్దాయన. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చారు. మరి ఇప్పటికైనా ఈ వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి.

80 శాతం పారితోషకం తిరిగి ఇచ్చేశాం..

కాగా ఇదే సమావేశంలో ఆచార్య సినిమా పరాజయం, తన ఫ్యూచర్‌ ప్రాజెక్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం నేను ఒప్పుకున్న సినిమాలన్నీ వచ్చే ఏడాది వేసవి నాటికి ప్రేక్షకుల ముందుకు వస్తాయి. మార్చి నుంచి కొత్త ప్రాజెక్ట్‌ల గురించి ఆలోచిస్తాను. బాబీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నా రోల్ ఫుల్‌ మాస్‌గా ఉంటుంది. డైలాగులన్నీ తూర్పుగోదావరి జిల్లా యాసలో ఉంటాయి. నా గత సినిమా ఆచార్య ఫ్లాప్‌ అయినందుకు నేను ఏమీ బాధపడలేదు. ఆ సినిమా పరాజయం పాలైనందుకు గాను నేను , చరణ్‌ 80 శాతం పారితోషకాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాం. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ కంటే గాడ్‌ఫాదర్‌ సక్సెస్‌నే చరణ్‌ ఎక్కువగా ఆస్వాదిస్తున్నాడు’ అని చెప్పుకొచ్చారు చిరంజీవి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

SSC స్టెనో పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
SSC స్టెనో పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
మేడారంలో తొలి ఘట్టం.. ఈ మండమెలిగే పండగ ప్రత్యేకత ఏంటో తెలుసా?
మేడారంలో తొలి ఘట్టం.. ఈ మండమెలిగే పండగ ప్రత్యేకత ఏంటో తెలుసా?
'ఆయన పార్థివ దేహాన్ని దర్శించే అర్హత కూడా నాకు లేదు'
'ఆయన పార్థివ దేహాన్ని దర్శించే అర్హత కూడా నాకు లేదు'
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!