Chiranjeevi: ‘ఎన్నో మధుర క్షణాలు.. అద్భుతమైన జ్ఞాపకాలు’ వరుణ్‌, లావణ్యల పెళ్లిపై చిరంజీవి ఎమోషనల్

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిల వివాహం ఈనెల ప్రారంభంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీలోని టుస్కానీ వేదికగా లావణ్య మెడలో మూడు ముళ్లు వేశాడు వరుణ్‌. ఈ మెగా పెళ్లి వేడుకకు చిరంజీవి దంపతులు, పవన్ కల్యాణ్‌ దంపతులు, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌లతో పాటు మెగా- అల్లు కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు.

Chiranjeevi: ఎన్నో మధుర క్షణాలు.. అద్భుతమైన జ్ఞాపకాలు వరుణ్‌, లావణ్యల పెళ్లిపై చిరంజీవి ఎమోషనల్
Chiranjeevi Family

Updated on: Nov 26, 2023 | 7:09 PM

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిల వివాహం ఈనెల ప్రారంభంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీలోని టుస్కానీ వేదికగా లావణ్య మెడలో మూడు ముళ్లు వేశాడు వరుణ్‌. ఈ మెగా పెళ్లి వేడుకకు చిరంజీవి దంపతులు, పవన్ కల్యాణ్‌ దంపతులు, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌లతో పాటు మెగా- అల్లు కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. అలాగే నితిన్‌ లాంటి టాలీవుడ్ స్టార్స్‌ కూడా సందడి చేశాడు. ఆ తర్వాత పెళ్లికి రాని వారి కోసం హైదరాబాద్‌ లో గ్రాండ్‌ గా రిసెప్షన్‌ కూడా నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు విచ్చేశారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. కాగా వరుణ్‌- లావణ్యల పెళ్లి వేడుక జరిగి నెల గడుస్తున్నా ఈ మెగా వెడ్డింగ్‌ కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికీ నెట్టింట సందడి చేస్తున్నాయి. వరుణ్‌, లావణ్యలతో పాటు మెగా- అల్లు కుటుంబ సభ్యులందరూ అప్పుడప్పుడు పెళ్లి వేడుక ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వరుణ్‌- లావణ్యల పెళ్లి వేడుకకు సంబంధించిన ఒక ఫొటోను పంచుకున్నారు. హల్దీ వేడుకలో భాగంగా వధూవరులతో దిగిన ఫొటోను ఆయన అభిమానులతో షేర్‌ చేసకున్నారు.

‘ఇటలీలో ఒక అందమైన సాయంత్రం. ఇది చాలా కాలం క్రితం జరిగిందేమీ కాదు. ప్రేమతో ఒకటైన రెండు మనసులు, ఎన్నో మధురమైన క్షణాలు, జ్ఞాపకాలను తీసుకొచ్చాయి. అలాంటి ఒక అందమైన మధుర క్షణాన్ని మీతో పంచుకుంటున్నాను’ అని తన ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు చిరంజీవి. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. క్యూట్‌ కపుల్‌, లవ్లీ కపుల్‌ అంటూ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్‌ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవి పోస్ట్..

వరుణ్- లావణ్యల పెళ్లిలో మెగా ఫ్యామిలీ..

వరుణ్- లావణ్యల పెళ్లి వేడుక..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.