మెగాస్టార్ చిరంజీవి..ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ బాక్సాఫీస్ వద్ద రఫ్పాడించేస్తున్నారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు చిరు. చాలాకాలంగా మెగా అభిమానులు ఎదురుచూస్తున్న అసలైన మాస్ ఎంటర్టైనర్తో అలరించారు చిరు. దీంతో చిరు రాబోయే ప్రాజెక్ట్స్ పై అదే స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ ఇటీవల వచ్చిన భోళా శంకర్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కించిన ఈ సినిమా మెగా అభిమానులను నిరాశ పరిచింది. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కీలకపాత్రలలో నటించారు. ఇక ఈ మూవీ డిజాస్టర్ తర్వాత్ చిరు అంతగా బయట కనిపించలేదు. అటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యారు. ఇక ఆకస్కాత్తుగా అభిమానులకు చిరు తన న్యూలుక్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు. చిరుకు సంబంధించిన కొన్ని పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
అందులో చిరు న్యూలుక్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. అందులో స్లిమ్ అండ్ ట్రిమ్ గా కనిపించారు. కూల్ అండ్ డాషింగ్ లుక్స్ లో చిరు చూసి తెగ సంతోషపడిపోతున్నారు ఫ్యాన్స్. ఆరుపదుల వయసులోనూ ఆ స్టైల్ ఏంటీ బాసూ అంటూ చిరు న్యూపిక్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి న్యూలుక్..
Ultra Stylish Clicks Of Megastar #Chiranjeevi 🔥🔥
Boss @KChiruTweets#MegaStarChiranjeevi pic.twitter.com/oQPQkwcBIt
— Chiranjeevi Army (@chiranjeeviarmy) August 19, 2023
మరోవైపు చిరు బర్త్ డే సెలబ్రెషన్స్ షూరు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో చిరు పుట్టినరోజు వేడుకలను మరింత గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అలాగే సోషల్ మీడియాలో చిరు బర్త్ డే సెలబ్రెషన్స్ ఫోటోస్, త్రోబ్యాక్ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి న్యూలుక్..
Cool 😎 and dashing #MegastarChiranjeevi . Ee age lo kuda aa style and grace 👏 boss 🔥 pic.twitter.com/1gVxzg9eOQ
— Madhuuu (@toxickk789) August 19, 2023
ఇక చిరు సినిమాల విషయానికి వస్తే.. బంగార్రాజు మూవీ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో ఓ మూవీ చేయనున్నారు. అలాగే బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వంలో చిరు సినిమా చేయనున్నారు. ఇక మరో రెండు రోజుల్లో ఆగస్ట్ 22న చిరు బర్త్ డే కావడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ప్రకటనలు రానున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.