గాడ్ ఫాదర్ సినిమా హిట్ ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మూవీ కాకుండా చిరు చేతిలో మరో రెండు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో మెగా 154 ఒకటి. ప్రస్తుతం మెగా 154 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డైరెక్టర్ బాబీ రూపొందిస్తున్నారు. ఇందులో చిరు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. కీలకపాత్రలో మాస్ మాహారాజా రవితేజ నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో చిరు పక్కా ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించి కొద్ది రోజులుగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మెగా అభిమానులకు స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా టైటిల్ టీజర్ ను దీపావళి కానుకగా అక్టోబర్ 24న ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మెగాస్టార్ ఫోటోతో పాటు బాస్ వస్తుండు అంటూ లేటెస్ట్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రూయనిట్. తాజా పోస్టర్ లోనూ మెగాస్టార్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమా కాకుండా చిరు.. భోళా శంకర్ సినిమాలోనూ నటిస్తున్నారు. డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో చిరు చెల్లిగా కీర్తిసురేష్.. కథానాయికగా తమన్నా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ జరుపుకుంటున్నాయి.
సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు చిరు. ఇప్పటికే ఎన్నో అంచనాలు మధ్య ఆచార్య సినిమా విడుదలగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇటీవల డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన గాడ్ ఫాదర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో నయనతార, పూరీ జగన్నాధ్, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలకపాత్రలలో నటించారు.
Let us welcome the MASS MOOLAVIRAT this Diwali ?#Mega154 Title Teaser Launch on 24th October at 11.07 AM ❤️?
Poonakalu Loading ?
Megastar @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @shrutihaasan @dirbobby @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/DPvpXZ3oaI
— Mythri Movie Makers (@MythriOfficial) October 20, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.