Mana Shankaravaraprasad Garu Movie: మన శంకరవరప్రసాద్ గారు సినిమా .. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తాజాగా అడియన్స్ ముందుకు వచ్చింది. సంక్రాంతి ఫెస్టివల్ సందర్బంగా జనవరి 12న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. కానీ అంతకు ముందే ప్రీమియర్స్ పడడంతో ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Mana Shankaravaraprasad Garu Movie: మన శంకరవరప్రసాద్ గారు సినిమా .. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..
Mana Shankaravaraprasad garu Movie Twitter Review,

Updated on: Jan 12, 2026 | 8:31 AM

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు.. మరోసారి సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి వచ్చేశాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన లేటేస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించగా.. ఇందులో విక్టరీ వెంకటేశ్ స్పెషల్ రూల్ పోషించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైమెంట్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. అంతకంటే ముందుగా ఆదివారం (జనవరి 11న) రాత్రి ప్రీమియర్ షూస్ పడ్డాయి. అయితే ఈ సినిమాపై అడియన్స్ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఎక్సలెంట్ ఫిల్మ్ అని.. బాస్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. వెంకీ మామ కామెడీ.. అనిల్ రావిపూడి డైరెక్షన్ అదిరిపోయిందని అంటున్నారు. ఫస్టాఫ్ అదిరిపోయిందని.. చిరంజీవి ఎంట్రీ, హుక్ స్టెప్ సాంగ్, ఫస్ట్ ఫైట్ వింటేజ్ మెగాస్టార్ ను గుర్తు చేశాయని అంటున్నారు. అలాగే చిరు, నయనతార మధ్య వచ్చే సీన్స్.. అలాగే చిరంజీవి, బుల్లిరాజు మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్ గా పేలాయని రివ్యూస్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

ఈ సినిమాలో అనిల్ రావిపూడి ట్రేడ్ మార్క్ కామెడీ వర్కౌట్ అయ్యిందని.. పండక్కి ఫ్యామిలీ అడియన్స్ కు సంక్రాంతి పండక్కి అసలైన ఎంటర్టైన్మెంట్ అందించాడని అంటున్నారు.

 

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..