Vakeel Saab Movie: వకీల్ సాబ్ విడుదల వేళ…పవర్ స్టార్ రేర్ ఫోటోను షేర్ చేసిన చిరంజీవి

Chiranjeevi on Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ పై దృష్టి పెట్టి.. సినిమాలకు తాత్కాలికంగా గ్యాప్ ఇచ్చాడు.. దాదాపు మూడేళ్ళ తర్వాత...

  • Surya Kala
  • Publish Date - 6:45 pm, Thu, 8 April 21
Vakeel Saab Movie: వకీల్ సాబ్ విడుదల వేళ...పవర్ స్టార్ రేర్ ఫోటోను షేర్ చేసిన చిరంజీవి
Chiru Pawan

Chiranjeevi on Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ పై దృష్టి పెట్టి.. సినిమాలకు తాత్కాలికంగా గ్యాప్ ఇచ్చాడు.. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో తన తమ్ముడు సినిమా వకీల్ సాబ్ కోసం అందరిలాగే తాను కూడా ఎదురుచూస్తున్నానని మెగాస్టార్‌ చిరంజీవి చెప్పారు.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ రేపు (ఏప్రిల్ 9న ) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తన తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఒక ఫోటోను షేర్ చేశారు. చిరు తన తమ్ముడు పవన్‌కల్యాణ్‌కు జుట్టు సరిచేస్తున్న ఒక ఓల్డ్ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో కి చాలాకాలం తర్వాత పవన్‌కల్యాణ్‌ను వెండితెర మీద చూడటానికి మీలాగే నేను కూడా ఎదురుచూస్తున్నాను అంటూ ఓ కామెంట్ ని కూడా జత చేశారు. అంతేకాదు.. వకీల్ సాబ్ ను అమ్మ, కుటుంబసభ్యులతో కలిసి రేపు సాయంత్రం థియేటర్‌లో వకీల్‌సాబ్‌ చూడనున్నాం. సినిమా చూసిన తర్వాత నా స్పందన మీతో పంచుకోవాలని ఎంతో ఆత్రుతగా ఉన్నాను అని మెగాస్టార్ చెప్పారు.

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ లో పవన్‌ సరసన శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటించారు. నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే థియేటర్స్ వద్ద అభిమానులతో సందడి మొదలైంది. మొదటి షో టికెట్స్ భారీ ధరకు అమ్ముడనట్లు తెలుస్తోంది. మూడేళ్ళ తర్వాత తమ అభిమాన హీరోని తెరపై చూడడానికి ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

Also Read: బ్రూస్ లీ కే సాధ్యమైన వన్ ఇంచ్ పంచ్ టెక్నీక్‌తో ఓ యువకుడి వీడియో.. బ్రుస్ లీ మళ్ళీ పుట్టాడంటూ నెటిజన్లు ఫిదా

ఉగాది పండుగకి అల్లుడైన వెంకన్నని ఇంటికి రమ్మని పిలిచే ముస్లిం భక్తులు..