మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. ఎప్పటికీ ఫుల్ జోష్‌లో కనిపిస్తారు.. ఆయనలో ఉండే మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాటలైన.. ఫైటులైనా.. యాక్షన్ సీన్స్ అయినా.. కామెడీలోనైనా చిరు స్టైలే వేరు. సినిమాల్లో కాకుండా.. ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో చిరు మాట్లాడే విధానం.. సరదాగా వ్యవహరించే తీరును చూస్తుంటాం.. కానీ స్టేజ్ పై తనదైన స్టైల్లో కామెడీ చేయడం చాలా అరుదు. తన మార్క్ కామెడీ పంచులతో నవ్వులు పూయించే చిరు .. ఈసారి ఏకంగా సూపర్ స్టార్ రజినీ కాంత్‌ను ఇమిటేట్ చేసి అదుర్స్ అనిపించాడు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సింగింగ్ షో ఫైనల్ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. ఈ షో గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరు.. ఓ సందర్భంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించి ప్రస్తావించారు.. అంతేకాకుండా రజినీ స్టైల్ ఫాలో అవుతూ.. ఆయన ఎలా నడుస్తారనే దాన్ని ఇమిటేట్ చేసి చూపించారు.. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యంతో ఈలలు, కేరింతలు, అరుపులతో రచ్చ చేశారు..ఆ తర్వాత ఓ కంటెస్టెంట్ రజినీ వీరాభిమాని కావడంతో అతనికి తన కళ్లజోడును కానుకగా ఇచ్చి.. రజినీ స్టైల్లో పెట్టుకోమన్నారు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే.. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకులను అలరించిన చిరు.. ఇప్పుడు గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాల చిత్రీకరణలో పాల్గోంటున్నాడు.. ప్రస్తుతం ఈ చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇవే కాకుండా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా చేయనున్నాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.