మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం గాడ్ ఫాదర్.. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. బుధవారం అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది చిత్రయూనిట్. తాజాగా గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మన స్టేట్ సీఎం పీకేఆర్ ఆకస్మాక మరణం.. మంచోళ్లు అందరూ మంచోళ్లు కారు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి.. వెనకగా. అన్ని రంగులు మారతాయి అంటూ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వాయిస్‌తో మొదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.