Megastar Chiranjeevi: వెండితెర జమిందార్ శరత్ బాబు మరణం కలచి వేసింది.. మెగాస్టార్ చిరంజీవి..
వెండితెర 'జమిందార్', ప్రముఖ నటుడు. శరత్ బాబు గారి మరణ వార్త కలచివేసింది. అందం హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న శ్రీ శరత్ బాబు గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది.

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకలోకాన్ని అలరించిన గంభీర స్వరం మూగబోయింది. ప్రముఖ టాలీవుడ్ నటుడు శరత్‌బాబు ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్‌కి దారి తీయడంతో మెరుగైన చికిత్స కోసం ఈ నెల 20న హైదరాబాద్‌కి తరలించారు. గుండె, లివర్, కిడ్నీ, లంగ్స్ ఇన్‌ఫెక్షన్ పెరగడంతో చికిత్స ఫలించక కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని.. ఆయన వెండితెర జమిందారు అని.. శరత్ బాబుతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ట్వీట్టర్ వేదికగా భావోద్వేగ నోట్ షేర్ చేశారు చిరు.
” వెండితెర ‘జమిందార్’, ప్రముఖ నటుడు. శరత్ బాబు గారి మరణ వార్త కలచివేసింది. అందం హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న శ్రీ శరత్ బాబు గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. అనేక చిత్రాలలో ఆయన నా సహనటుడుగా ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులందరికీ నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి !” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.




1973లో రామరాజ్యం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు శరత్‌బాబు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీల్లో దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించారు. పవన్ కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్‌లో చివరిసారి స్క్రీన్ మీద కనిపించారు. అయితే, శరత్‌బాబు చివరి సినిమా మాత్రం మళ్లీ పెళ్లి. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ఆయన చివరిసారిగా నటించారు. మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, తాయారమ్మా బంగారయ్యా… మూడు ముళ్ల బంధం, సీతాకోక చిలుక, స్వాతిముత్యం, జీవనజ్యోతి… అభినందన, స్వాతిచినుకులు, ఆపద్బాంధవుడు, నువ్వు లేక నేను లేను, శంకర్‌దాదా జిందాబాద్, శ్రీరామదాసు, ఆట, శౌర్యం, సాగరసంగమం… షిరిడిసాయి, ఎంత మంచివాడవురా, వకీల్ సాబ్ చిత్రాల్లోని పాత్రలకు మంచి గుర్తింపుదక్కింది.
వెండితెర ‘జమిందార్’, ప్రముఖ నటుడు శరత్ బాబు గారి మరణ వార్త కలచివేసింది. అందం హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న శ్రీ శరత్ బాబు గారితో నాకు ఎంతో అనుబంధం వుంది. అనేక చిత్రాలలో ఆయన నా సహనటుడుగా ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులందరికీ నా… pic.twitter.com/za0FpSyeJV
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 22, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.