- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroines like Pooja Hegde Kiara Advani Trisha following technic for getting his
నయా రూట్ లో నాయికల ప్రయాణం.. కలిసొస్తుందా మరి ??
ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నాయ్.. బుల్లెట్ దిగిందా? లేదా?.. అనేది ఏజ్ ఓల్డ్ డైలాగ్. ఎలా వచ్చాం అన్నది కాదు గురూ.. హిట్ కొట్టామా? లేదా? అనేది హీరోయిన్లు పదే పదే వాడుతున్న కొత్త మాట. ఇంతకీ ఎలా వచ్చామని ఎందుకన్నట్టు.. అని ఆలోచిస్తున్నారా? మాట్లాడుకుందాం.. పదండి. కూలీ సినిమాతో జనాలను పలకరించడానికి గొంతు సవరించుకుంటున్నారు శ్రుతిహాసన్.
Updated on: Apr 25, 2025 | 8:14 PM

కూలీ సినిమాతో జనాలను పలకరించడానికి గొంతు సవరించుకుంటున్నారు శ్రుతిహాసన్. ఆగస్టు 14న ఈ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు శ్రుతి.

సేమ్ డేట్‌కి వార్2తో జనాలకు హాయ్ చెప్తారు కియారా అద్వానీ. సంక్రాంతికి గేమ్ చేంజర్ ఫ్లాప్ కావడంతో, వార్2 మీదే ఆశలు పెట్టుకున్నారు ఈ కాబోయే మాతృమూర్తి.

నెక్స్ట్ తెలుగు రిలీజులు ఏం ఉన్నాయ్ మేడమ్ అని ఆ మధ్య తిరుపతిలో పూజాహెగ్డేని అడిగితే.. ఏమాత్రం తడుముకోకుండా రెట్రో పేరు చెప్పేశారు. రెట్రోని మనవారు తమిళ సినిమాగా చూస్తుంటే, పూజా మాత్రం కంప్లీట్ తెలుగు సినిమాగానే ఫీలవుతున్నారు.

ధనుష్ ఇడ్లీకడైతో పలకరించడానికి రెడీ అవుతున్నారు నిత్యామీనన్. ఈ మధ్యనే గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్ అందుకున్న త్రిష, నెక్స్ట్ థగ్‌లైఫ్ కోసం ఎదురుచూస్తున్నారు. పీయస్1, పీయస్2 తర్వాత మణిరత్నం డైరక్ట్ చేస్తన్న థగ్‌లైఫ్‌లో నటిస్తున్నారు త్రిష.

రీసెంట్ ఓదెల2 రిలీజ్ చూసిన తమన్నా, మే 1న రైడ్2తో పలకరించనున్నారు. ఈ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్‌కి ఆల్రెడీ మంచి అప్లాజ్ అందుతోంది.




