
భోళా శంకర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే ఆయన మనశంకర వరప్రసాద్ గారు గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే విక్టరీ వెంకటేష్ కూడా మరో హీరోగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల, శఖి రేఖ పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు చిరంజీవి చేతిలో విశ్వంభర సినిమా కూడా ఉంది. అలాగే వాల్తేరు వీరయ్య డైరెక్టర్ కే.ఎస్. రవీంద్ర తో మరో సినిమాకు రెడీ అయ్యారు మెగాస్టార్.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగుల్లో బిజీ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన మేనేజర్ స్వామినాథ్ కుమార్తె బారసాల వేడుకకు హాజరయ్యారు. సతీమణి సురేఖతో కలిసి ఈ వేడుకకు హాజరైన చిరంజీవి చిన్నారికి అలేఖ్య అని నామకరణం చేశారు. దీంతో మేనేజర్ దంపతులు ఆనందంతో ఎమోషనల్ అయ్యారు. ఇదే సందర్భంగా చిరు దంపతులు తమ గొప్ప ప్రేమను చాటుకున్నారు. ఆ చిన్నారికి ఖరీదైన కానుక అందించారు. ఆ చిట్టి తల్లికి గోల్డ్ చైన్ బహుకరించారు. దీంతో పాటు దాదాపు కోటి రూపాయల విలువైన ల్యాండ్ కానుకగా ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కోటి రూపాయల ల్యాండ్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
Megastar @KChiruTweets Garu and Surekha Garu graced the naming ceremony of Manager Swamynath’s daughter today and blessed the baby girl with their warm wishes✨ pic.twitter.com/Tix55I0Dk1
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 5, 2025
#Sasirekha Song Storms 1️⃣5️⃣M+ Views On @YouTube in 24 Hours📈🔥
Oo Prasadu, Audience Response Keka…🕺🔥@KChiruTweets #Nayanthara @AnilRavipudi #ManaShankaraVaraPrasadGaru #MSG pic.twitter.com/p02L7uZCSb
— Chiru Trends (@KChiruFanTrends) December 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.