Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, షారుఖ్ ఖాన్ కలిసి నటించిన సీరియల్ పేరెంటో తెలుసా ?..

షారుఖ్, నయన్ జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈచిత్రంలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించగా.. దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఈ సినిమాతో కింగ్ మళ్లీ వచ్చేశాడు.. కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్లతో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న బాలీవుడ్ ఇండస్ట్రీని మళ్లీ బాద్ షా సెట్ చేశాడంటూ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, షారుఖ్ ఖాన్ కలిసి నటించిన సీరియల్ పేరెంటో తెలుసా ?..
Shah Rukh Khan, Megastar Ch

Updated on: Sep 09, 2023 | 2:05 PM

జవాన్ సినిమా సక్సెస్ తో ఫుల్ ఖుషిగా ఉన్నాడు బాద్ షా షారుఖ్ ఖాన్. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్, నయన్ జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈచిత్రంలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించగా.. దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఈ సినిమాతో కింగ్ మళ్లీ వచ్చేశాడు.. కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్లతో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న బాలీవుడ్ ఇండస్ట్రీని మళ్లీ బాద్ షా సెట్ చేశాడంటూ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. సౌత్ టూ నార్త్ అడియన్స్ నుంచి జవాన్ చిత్రానికి ఊహించని స్తాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా షారుఖ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, షారుఖ్ కలిసి ఓ సీరియల్లో నటించారు.

సినిమాల్లోకి రావడానికి ముందు మెగాస్టార్ చిరంజీవి ఓ సీరియల్‌లో నటించారనే విషయం చాలా మందికి తెలియదు. ఇక అదే సీరియల్‌లో షారూఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించాడు. చిరంజీవి 1978లో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన తర్వాత కూడా చిరంజీవి సీరియల్స్‌లో నటించారు. 1985లో ప్రసారమైన ‘రజనీ’ సీరియల్‌లో బసు ఛటర్జీ, ప్రియా టెండూల్కర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సీరియల్‌లోని కొన్ని ఎపిసోడ్స్‌లో చిరంజీవి ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే సినీ పరిశ్రమలో విపరీతమైన డిమాండ్ ఉండడంతో చిరంజీవికి కాల్షీట్ ఇవ్వడం కుదరలేదు. దీంతో ఓ ఎపిసోడ్‌లో అతిథి పాత్రలో కనిపించాడు.

ఇవి కూడా చదవండి

అప్పట్లో ఈ సీరియల్ డిడి నేషనల్‌లో ప్రసారమయ్యింది. ఈ సీరియల్‌లోని రెండు ఎపిసోడ్‌లలో షారూఖ్ కూడా అతిథి పాత్రలో కనిపించాడు. ఈ సీరియల్ కు విశేష ఆదరణ లభించించింది. సీరియల్‌కు వ్యతిరేకంగా కొన్ని సంస్థలు టెలివిజన్ కార్యాలయం ముందు నిరసనకు దిగాయి. దీంతో సీరియల్ కొన్ని ఎపిసోడ్‌ల తర్వాత ముగించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.