chiranjeevi acharya: రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్న మెగాస్టార్ ‘ఆచార్య ‘ఫస్ట్ సాంగ్

మెగాస్టార్ చిరంజీవి  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

chiranjeevi acharya:  రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్న మెగాస్టార్ ఆచార్య ఫస్ట్ సాంగ్
Acharya

Updated on: May 05, 2021 | 3:13 PM

chiranjeevi acharya: మెగాస్టార్ చిరంజీవి  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల కరోనా వ్యాప్తి ఎక్కువకావడంతో షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు చిత్రయూనిట్. . ఈ సినిమాలో చిరుతోపాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, చరణ్ సరసన పూజాహెగ్డే నటిస్తుంది. చిరు చరణ్ ఇద్దరు ఆచార్య  సినిమాలో నక్సలైట్లుగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా విడుదల వాయిదా పడింది. కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు మేకర్స్.

అయితే కోవిడ్ చల్లబడేసరికి మరో మూడు నెలలు గ్యారంటీగా పట్టొచ్చన్నది ఒక అంచనా. అందుకే ఆగస్టులో రిలీజ్ కోసం ఆచార్య రెడీ అవుతున్నారట. ఇప్పటికే పుష్ప, ఎఫ్3 సినిమాలు ఆగస్టు మంత్ లో కర్చీపేసుకున్నాయి. అదే నెలలో ఓ మంచి గ్యాప్ కోసం వెతుకుతోందట టీమ్ ఆఫ్ ఆచార్య. ఇదిలా ఉంటే. ఆచార్య మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ లాహే లాహే… నెటిజన్లను మరింతగా ఎట్రాక్ట్ చేస్తోంది. మణిశర్మ మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్.. ఈ పాటను ఇప్పటికీ క్రేజీగా మార్చాయి. వ్యూస్ లో 30 మిలియన్ల మార్క్ దాటి.. లైక్స్ లో 5 లక్షల దిశగా పరుగు పెడుతోంది లాహెలాహే సాంగ్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Power Star: ఇక్కడ డిజాస్టర్ అయిన పవన్ సినిమా బాలీవుడ్ కు పయనమైంది.. అక్కడేమవుతుందో మరి..

Singer Sunitha: దర్శకుడు అలా అనేసరికి చాలా కోపం వచ్చింది.. ఆసక్తికర విషయం చెప్పిన అందాల సింగర్..

Sonu Sood : కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు రియల్ హీరో సోనూసూద్ విజ్ఞప్తి… మద్దతు తెలిపిన గ్లోబల్ బ్యూటీ..