
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇందులో వైష్ణవ్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందే వైష్ణవ్‌కు ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ యంగ్ హీరోతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అర్జున్ రెడ్డి తమిళ్ వెర్షన్‌ను తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్ పై బీవీఎస్ఎస్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఈ మూవీ షూటింగ్ మంగళవారం పూజా కార్యక్రమాలు జరిపి స్టార్ట్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ మాట్లాడుతూ.. ఉప్పెన సినిమాతో యువతకు దగ్గరైన వైష్ణవ్ తేజ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసే కథతో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందిస్తున్నాము. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా శిష్యుడు గిరీశాయ ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడని అన్నారు. ఈ మూవీలో వైష్ణవ్‌కు జోడీగా కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ట్వీట్..
Lights! Camera! & Action #Vaisshnav3 First Day Shoot Commenced Today ?@ketikasharmaa @GIREESAAYA @ThisIsDSP
@Shamdat2 @BvsnP @SVCCofficial @vamsikaka pic.twitter.com/RIs33u3j5Z— Panja Vaisshnav Tej (@VaisshnavTej) August 10, 2021
Also Read: Nayanatara: రింగ్ చూపిస్తూ అసలు విషయం చెప్పిన లేడీ సూపర్ స్టార్.. ఇంతకీ పెళ్లెప్పుడో ?
Allu Arjun: త్వరలో పట్టాలెక్కనున్న ‘ఐకాన్’ మూవీ.. అల్లు అర్జున్‌కు జోడీగా మరోసారి ఆ భామ..