రీజినల్ సినిమాల్లో ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఆల్ టైమ్ రికార్డు.. 5 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు' కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 200 కోట్ల కలెక్షన్లు దాటేసిన ఈ మెగా మూవీ ఇప్పుడు రీజినల్ సినిమా కలెక్షన్లలో ఆల్ టైమ్ రికార్డును అందుకుంది.

రీజినల్ సినిమాల్లో మన శంకరవరప్రసాద్ గారు ఆల్ టైమ్ రికార్డు.. 5 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
Mana Shankara Vara Prasad Garu Movie

Updated on: Jan 17, 2026 | 11:10 AM

‘మన శంకరవరప్రసాద్ గారు’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. మెగాభిమానులకు నచ్చేలా మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో చిరంజీవి సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు తొలి రోజే రూ. 84 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్లను దాటేసిన ఈ మూవీ 5 రోజుల కలెక్షన్లకు సంబంధించి నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. ఇప్పటివరకు ఈ మూవీ మొత్తం రూ. 226 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని మేకర్స్ పేర్కొన్నారు. అంతే కాదు రీజినల్ సినిమాల్లో ఇది ఆల్ టైమ్ రికార్డు అంటూ సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.

ఇక ఓవర్సీస్ లోనూ మన శంకరవరప్రసాద్ కు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో 2.25 మిలియన్ల డాలర్క్ మార్క్ ను అధిగమించినట్లు నిర్మాతలు తెలిపారు. కాగా మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేసిందని ప్రేక్షకుల డిమాండ్ కు తగ్గట్టుగా చాలా ఏరియాల్లో అదనపు షోలు వేస్తున్నానమని మేకర్స్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మన శంకరవరప్రసాద్ గారు 5 రోజుల కలెక్షన్ల పోస్టర్..

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాను నిర్మించారు. చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరిశాడు. క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. భీమ్స్ స్వరాలు సమకూర్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..