Tees Maar Khan : మెగా హీరో చేతుల మీదుగా కుర్ర హీరో సినిమా ఫస్ట్ సింగిల్..

| Edited By: Ravi Kiran

Feb 05, 2022 | 7:32 AM

కుర్ర హీరో ఆది సాయికుమార్ చాలా కాలంగా సైరైన హిట్ కోసం ఎదురుచుస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ మంచి విజయాన్ని మాత్రం అందుకోలేక పోతున్నాడు ఆది.

Tees Maar Khan : మెగా హీరో చేతుల మీదుగా కుర్ర హీరో సినిమా ఫస్ట్ సింగిల్..
Aadi
Follow us on

Tees Maar Khan : కుర్ర హీరో ఆది సాయికుమార్ చాలా కాలంగా సైరైన హిట్ కోసం ఎదురుచుస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ మంచి విజయాన్ని మాత్రం అందుకోలేక పోతున్నాడు ఆది. అప్పుడెప్పుడో వచ్చిన ప్రేమ కావాలి లవ్ లీ సినిమాల తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు ఆది. ఈ క్రమంలో తాజాగా తీస్మార్ ఖాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్‌ కానుంది.

తాజాగా ఈ సినిమానుంచి `పాప ఆగవే..` అంటూ సాగే పెప్పీ టీజింగ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటను మెగా హీరో వరుణ్ తేజ్ రిలీజ్ చేసి చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సాంగ్ ఆద్యంతం పాయల్ అందాలతో ఆకట్టుకుంది. కవ్వించే ఎక్స్ప్రెషన్స్ తో పాయల్ కుర్రకారును అలరించింది. మెలోడీలో ఆది స్టైలిష్ స్టెప్పులు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యువతరం మెచ్చే ఓ ప్రేమికుడు తన ప్రేయసిపై ఉన్న ఫీలింగ్స్ బయటపెడుతూ సాగుతున్న ఈ పాటను భాస్కర్ భట్ల రచించారు. కారుణ్య గానం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. సాయి కార్తీక్ అందించిన సంగీతం స్మార్ట్. ఈ పాట పై మీరూ ఓ లుక్కెయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajasekhar: మీ ఆశీస్సుల వల్లే బతికున్నాను.. శేఖర్‌ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..

Bhanu Shree: లేహంగాలో అట్రాక్ట్ చేస్తున్న భాను శ్రీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

CPI Narayana: జగన్ చిన్న పిల్లాడు.. నాగార్జున అంటే నాకు అసహ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నారాయణ