
యంగ్ హీరో నవదీప్ చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వెబ్ సిరీస్ చేస్తూ మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే న్యూసెన్స్ వెబ్ సిరీస్‌తో ప్రశంసలు అందుకున్నారు నవదీప్. ఇప్పుడు ఆయన నటిస్తోన్న మరో సినిమాతో మాయాబజార్ ఫర్ సేల్. సీనియర్ నటుడు నరేష్, ఈషా రెబ్బ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు గౌతమి చల్లగుళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. రాజీవ్ రంజన్ నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమయినట్లుగా ట్రైలర్ చేస్తే అర్థమవుతుంది. మాయాబజార్ అనే సౌత్ ఇండియన్ గేటెడ్ కమ్యూనిటీలో చాలా డబ్బులు ఖర్చు చేసి ఓ విల్లా తీసుకుంటాడు నరేష్. అతను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని కూతురు ఈషా రెబ్బ ఓ చైనీస్ వ్యక్తిని ప్రేమిస్తుంటుంది. ఈ మాయాబజార్ అనే సౌత్ ఇండియన్ గేటెడ్ కమ్యూనిటీకి బ్రాండ్ అంబాసిడర్ నవదీప్.
ఇందులో ఒక్కో ఫ్యామిలీ ఒక్కో కథ. అయితే ఈ కమ్యూనిటీ ఉన్న ఇల్లీగల్ స్థలంలో అని బ్రాండ్ అంబాసిడర్ కు లీగల్ నోటీసులు ఇస్తారు. ఇక ఆ విషయం తెలుసుకున్న నరేష్.. ఎలాగైనా ఆ విల్లా వదిలించుకుని డబ్బులు రిటర్స్ తెచ్చుకోవాలనుకుంటాడు. మరోవైపు ప్రభుత్వం ఆ విల్లాను కూల్చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తుంది. దీంతో వీరంతా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోన్నారు ? అనేది సినిమా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.