AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manoj Bajpayee : ప్రభాస్ కోసం విలన్‌గా మారనున్న ఫ్యామిలీ మ్యాన్.. డార్లింగ్‌ను ఢీ కొట్టనున్న మనోజ్ ..

టాలీవుడ్‌లోకి సినిమా సినిమాకు కొత్త కొత్త విలన్ లు పుట్టుకొస్తున్నారు. పక్క ఇండస్ట్రీలనుంచి విలన్లను ఇప్పటికే చాలా మందిని ఇంపోర్ట్ చేసింది టాలీవుడ్..

Manoj Bajpayee : ప్రభాస్ కోసం విలన్‌గా మారనున్న ఫ్యామిలీ మ్యాన్.. డార్లింగ్‌ను ఢీ కొట్టనున్న మనోజ్ ..
Salaar
Rajeev Rayala
| Edited By: |

Updated on: Aug 28, 2021 | 8:51 AM

Share

Manoj Bajpayee : టాలీవుడ్‌లోకి సినిమా సినిమాకు కొత్త కొత్త విలన్‌లు పుట్టుకొస్తున్నారు. పక్క ఇండస్ట్రీలనుంచి విలన్లను ఇప్పటికే చాలా మందిని ఇంపోర్ట్ చేసింది టాలీవుడ్. అలా వచ్చిన వారు తమ నటనతో ఇక్కడ అవకాశాలు బాగానే రాబట్టుకుంటున్నారు. అంతే కాదు పక్క రాష్ట్రాల హీరోలు కూడా మన సినిమాల్లో విలన్‌గా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే కన్నడ స్టార్ సుధీప్ ఈగ కోసం విలన్ అవతారమెత్తారు. ఇటీవల తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఉప్పెన కోసం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అంతే కాదు ఫ్యామిలీ ఆడియన్స్‌కి మోస్ట్ ఫేవరిట్స్ అనిపించుకున్న హీరోలే గెటప్స్ మార్చి విలన్లుగా కనిపించడం ఇప్పుడు రన్నింగ్‌లో వున్న ఒక ట్రెండ్. ఇదే సీక్వెన్స్‌లో మరో ఫ్యామిలీమేన్… ఖల్‌నాయక్‌ వేషం కట్టనున్నారు. ఫ్యామిలీమేన్ అనగానే సినిమా సర్కిల్స్‌లో ఠక్కున  వినిపించే పేరు మనోజ్‌బాజ్‌పాయ్. ఆయన చేసిన ఫ్యామిలీమేన్‌ రెండు సిరీస్‌లూ ఆయన్ను పాజిటివ్ గా చూపించాయి కానీ… ఫ్లాష్‌బ్యాక్‌లో మాత్రం.. మనోజ్‌ విలన్ అన్న విషయం గుర్తుండే ఉంటుంది. ప్రేమకథలో రామ్‌గోపాల్‌ వర్మ చేతిచలవతో తెలుగు ఆడియన్స్‌కి ఇంట్రడ్యూస్ అయిన యంగ్ విలన్‌ మనోజ్. తర్వాత అల్లు అర్జున్ మూవీ హ్యాపీలో కాస్త మెత్తటి మనసున్న ప్రతినాయకుడిగా వెరీ డిఫరెంట్ గా కనిపించారు.

బన్నీతో కలిసి మరోసారి వేదం సినిమాలో కూడా చేశారు మనోజ్. కానీ… పవర్‌స్టార్‌ క్రేజీ మూవీ కొమురం పులిలో పోష్ అండ్ పాలిష్డ్‌ విలన్‌గా నటించి… వావ్ అనిపించారు ఈ బీహారీ బాబు.  ఇప్పుడు పదేళ్ల తర్వాత తెలుగు ఆడియన్స్‌కి మళ్లీ ఫ్రెష్ ఫీల్‌నిచ్చేందుకు రెడీ అంటున్నారీ ఫ్యామిలీమేన్. ప్రశాంత్ నీల్‌ డైరెక్ట్ చేస్తున్న సలార్ మూవీలో ప్రభాస్‌ని ఢీకొట్టే విలన్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారట ఈ వెర్సటైల్ యాక్టర్. ఇప్పటికే ఈ మూవీలో రాజమన్నార్‌గా జగపతిబాబు నటిస్తున్నారని అనౌన్స్ చేసిన చిత్రయూనిట్.. మరో విలన్ గా మనోజ్ బజ్‌పాయ్ పేరును త్వరలో ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bandla Ganesh: మీరు బుక్ చేసుకొండి.. నేను పర్మిషన్ ఇస్తా.. ఆసక్తికర ట్వీట్ చేసిన బండ్ల గణేష్..

Ariyana: అరియానా న్యూలుక్ చూసి కంగుతిన్న నెటిజన్స్.. అలా చూడలేమంటూ కామెంట్స్..

Love Story: అభిమానులకు మళ్లీ షాకిచ్చిన నాగచైతన్య.. లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి