Vishnu Manchu: మోహన్ బాబు పుట్టిన రోజున మంచు విష్ణు స్పెషల్ సర్ ప్రైజ్.. ‘అందరికీ ఫ్రీగా’ అంటూ వీడియో రిలీజ్
మంచు విష్ణు ప్రస్తుతం 'కన్నప్ప' సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉంటున్నాడు. పాన్ ఇండియ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీ లో ప్రభాస్ కూడా నటిస్తున్నాడు. పైగా ఇది తనకు డ్రీమ్ ప్రాజెక్టు అంటూ ముందునుంచి చెబుతున్నాడు విష్ణు. కాబట్టి కన్నప్పపై భారీగానే అంచనాలు ఉన్నాయి

మంచు విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉంటున్నాడు. పాన్ ఇండియ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీ లో ప్రభాస్ కూడా నటిస్తున్నాడు. పైగా ఇది తనకు డ్రీమ్ ప్రాజెక్టు అంటూ ముందునుంచి చెబుతున్నాడు విష్ణు. కాబట్టి కన్నప్పపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ లుక్ కు బాగానే రెస్పాన్స్ వచ్చింది. దీనిపై హీరో మంచు విష్ణు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కన్నప్ప సినిమా ఫస్ట్ లుక్ ను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు మంచు వారబ్బాయి. అలాగే తన సినిమాను జనాలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడీ హీరో. ఈ మేరకు తన పోషల్ మీడియా ఖాతాల్లో ఒక వీడియోను షేర్ చేశాడు విష్ణు. ‘కన్నప్ప మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసే ముందు నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే నేను గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేయలేదు. అలాంటిని నా మూవీ ఫస్ట్ లుక్‌కి వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా అనిపించింది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఆయన దీవెనల వల్లే కన్నప్ప సినిమా చేయగలుగుతున్నాను. కన్నప్ప చరిత్ర గురించి చాలా మంది అడుగుతున్నారు. అయితే అందరికీ ఒక్కొక్కరిగా ఆన్సర్ చేయాలంటే చాలా కష్టం. అందుకే మార్చి 19న నేను కన్నప్ప మీద ఓ కామిక్ బుక్ లాంఛ్ చేయబోతున్నాను. ఆ రోజు మొదటి వాల్యూమ్ విడుదల చేస్తున్నాను . ఇది లిమిటెడ్ ఎడిషన్‌గా రానుంది’
‘ ఈ స్టోరీ బుక్ మీద ఎవరికి ఆసక్తి ఉన్నా నాకు నేరుగాఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మార్చి 19న నా హీరో, మానాన్న పుట్టిన రోజు సందర్భంగా కన్నప్ప స్టోరీ బుక్‌ను లాంఛ్ చేస్తాను. నా ఆఫీస్ వాళ్లు బుక్ మీకు కొరియర్‌లో బుక్ పంపిస్తారు. ఎవరు మెసేజ్ చేస్తే వారికి ఉచితంగా ఈ పుస్తకం పంపిస్తాను. ఇందుకోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ అందరికీ కన్నప్ప చరిత్ర గురించి, శ్రీకాళహస్తి స్టోరీ చెప్పడం నా బాధ్యత.ఇందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అని వీడియోలో చెప్పుకొచ్చాడు విష్ణు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మంచు విష్ణు మంచి పనిచేస్తున్నాడంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




