Maa Elections 2021: ఎన్నికల బరిలోకి విష్ణు.. మరికాసేపట్లో తన ప్యానెల్‌ను ప్రకటించనున్న మంచు వారబ్బాయి..
Maa Elections 2021: సాధారణ ఎన్నికలను తలదన్నేలా మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల హంగామా జరుగుతోంది. ఎన్నిక తేదీని దగ్గరపడుతున్న కొద్దీ అందరిలోనూ ఆసక్తి..
Maa Elections 2021: సాధారణ ఎన్నికలను తలదన్నేలా మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల హంగామా జరుగుతోంది. ఎన్నిక తేదీని దగ్గరపడుతున్న కొద్దీ అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సారి అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహా రావులు ఉన్నారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యులను ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా మంచు విష్ణు కూడా తన ప్యానెల్ సభ్యులను ప్రకటించనున్నారు.
గురువారం (సెప్టెంబర్ 23) ఉదయం 11 గంటలకు మంచు విష్ణు తన ప్యానెల్‌ను ప్రకటించనున్నారు. మంచు విష్ణు ప్యానల్‌కు మా మాజీ అధ్యక్షుడు నరేష్ తన మద్ధతును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం నరేష్ అధ్యక్షతన విష్ణు ఓ సమాచారాన్ని కూడా నిర్వహించారు. ఇదిలా ఉంటే మంచు విష్ణు ప్యానెల్‌లో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో బాబు మోహన్, రఘుబాబు పేర్లు ఉన్నాయి. వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్, జనరల్ సెక్రెటరీగా రఘుబాబు ఉండనున్నారని సమాచారం.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కి ధీటుగా మంచు విష్ణు ప్యానెల్ ఉంటుందని చిత్ర పరిశ్రమతో పాటు, సినీ అభిమానుల్లో కూడా దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇకపోతే ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీ పదవికి జీవిత పోటీ పడతుండగా, బండ్ల గణేశ్ స్వతంత్రంగా బరిలో నిలవబోతున్నారు. మరి సర్వత్రా ఉత్కంఠతను రేపుతోన్న మా ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి.
Also Read: Bigg Boss Ariyana: గుడ్ న్యూస్ షేర్ చేసిన అరియనా గ్లోరి.. అంతా దేవుడి చల్లని దీవెన అంటూ..
Tollywood Drugs Case: ముగిసిన తరుణ్ విచారణ.. 7 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు..