విష్ణు కెరీర్ నిలబెట్టడం కోసం లేడీ గెటప్ వేసుకున్నా.. నన్ను ఎదగకుండా లాక్ చేశారు.. మనోజ్ ఎమోషనల్

మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్‌.. మంచు ఫ్యామిలీలో ఫైటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అన్నదమ్ముల మధ్య గొడవ రోజు రోజుకు ముదురుతోంది. తాజాగా మనోజ్ రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలో ఆందోళనకు దిగారు. తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ఆయన ఆరోపించారు. అలాగే మంచు విష్ణు పై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు మనోజ్.

విష్ణు కెరీర్ నిలబెట్టడం కోసం లేడీ గెటప్ వేసుకున్నా.. నన్ను ఎదగకుండా లాక్ చేశారు.. మనోజ్ ఎమోషనల్
Manchu Manoj

Updated on: Apr 09, 2025 | 6:14 PM

మంచు వారింట వివాదాలు ఆగడం లేదు. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఉదయం నుంచి ఇంటి గేటు బయట బైఠాయించిన మంచు మనోజ్ తనను లోపలకు వెళ్లనివ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా మనోజ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా ఉదయం నుంచి జల్‌పల్లి నివాసం దగ్గర మంచు మనోజ్ ఆందోళన కొనసాగుతుంది. తన ఇంట్లోకి తనను వెళ్లనివ్వాలని డిమాండ్ చేస్తున్నారు మంచు మనోజ్. కోర్టు ఆర్డర్ ఉన్నా తనను లోపలికి వెళ్లనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారని మనోజ్ ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్.. ఇదెక్కడి అరాచకం రా సామి..! ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి

అనంతరం  మీడియాతో మాట్లాడుతూ మనోజ్ భావోద్వేగానికి గురయ్యారు. తన కూతురు బర్త్‌డే కోసం ఏప్రిల్ 2న జల్‌పల్లికి వచ్చామంటున్నారు మనోజ్. అయితే ఇంట్లో పరిస్థితులు బాలేవని జైపూర్‌కు వెళ్లామని తెలిపారు. అలాగే తల్లి మీద ప్రమాణం చేస్తున్నా.. ఏ రోజూ ఆస్తి కోసం కొట్లాడలేదంటున్నారు.  తానంటే విష్ణుకి కుళ్లు అని అంటున్నారు మనోజ్‌. అదేవిధంగా తనను సినిమాల కోసం వాడుకున్నారని, ఈరోజు కూడా తనకు రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు మనోజ్.

ఇది కూడా చదవండి : పర్మిషన్ లేకుండా రేప్ సీన్ షూట్.. కట్ చేస్తే హీరోపై కేసు పెట్టిన స్టార్ హీరోయిన్

డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేశా.. స్టంట్స్ చేశా.. గొడ్డులాగా వాళ్ల సినిమాలకు నేను పని చేశా.. కానీ ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అని అన్నారు మనోజ్. నేను బయట ప్రొడక్షన్స్ లో హిట్ కొడితే నన్ను ఎదగనివ్వకుండా ఇక్కడకు తీసుకొచ్చి లాక్ చేశారు. విష్ణు బ్యానర్ లో నువ్వు చెయ్యాలి అని లాక్ చేసేశారు. నువ్వు ఇప్పుడు ఆడ గెటప్ వేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదు రా..అన్నారు. లేదు నేను లేడీ గెటప్ లో చేయడానికి నేను రెడీగా లేను అని అంటే.. నన్ను కూర్చోబెట్టి సెటిమెంట్ తో కట్టిపడేశారు. విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది.. వాడిని హీరోగా నిలబెడదాం.. లేడీ గెటప్ లో నువ్వు కామెడీ చేయగలవు అంటే అన్న కోసం అమ్మాయి గెటప్ కూడా వేసుకున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు మనోజ్.

ఇది కూడా చదవండి :నా బట్టలు నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.. అలాంటివి పట్టించుకోనంటున్న టాలీవుడ్ సింగర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.