Manchu Manoj: కన్నప్ప పై మంచు మనోజ్ ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే..

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు మూవీ లవర్స్.. ఈ క్రమంలోనే కన్నప్ప సినిమాపై ఆసక్తికర పోస్ట్ చేశారు మంచు విష్ణు.. చిత్రయూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Manchu Manoj: కన్నప్ప పై మంచు మనోజ్ ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే..
Manchu Manoj

Updated on: Jun 27, 2025 | 7:34 AM

మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు నటించిన సినిమా కన్నప్ప. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. బుల్లితెరపై రామాయణ్, మహాభారతం వంటి అద్భుతమైన సీరియల్స్ రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో ప్రభాస్ ముఖ్యమైన పాత్ర పోషించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఇందులో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసాయి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి అడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలో కన్నప్ప చిత్రాన్ని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తన అన్న విష్ణు పేరును ప్రస్తావించకుండానే మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

“కన్నప్ప టీంకు శుభాకాంక్షలు.. మా నాన్న, ఆయన టీమ్ ఈ సినిమా కోసం చాలా సంవత్సరాలపాటు కష్టపడ్డారు. ఈ సినిమా పట్ల ఎంతో ప్రేమను కురిపించారు. సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను. మై లిటిల్ చాంపియన్స్ అరి, వివి, అవ్రామ్ లను బిగ్ స్క్రీన్ మీద చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తనికెళ్ల భరణి లైఫ్ లాంగ్ డ్రీమ్ రేపు సజీవంగా మారుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ప్రభాస్ గోల్డెన్ హార్ట్.. గాడ్ ఆఫ్ ది గాడ్స్ మోహన్ లాల్, ప్రభుదేవా, అక్షయ్ కుమార్ తోపాటుగా ఈ మూవీపై ప్రేమతో నమ్మకంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ పెద్ద తెరపై ప్రకాశించడం చూడాలని వెయిట్ చేస్తున్నాను. ఈ ప్రయాణాన్ని శివుడు ప్రేమతో ఆశీర్వదించాలి” అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

అలాగే బ్లాక్ బస్టర్ వైబ్స్.. మైథాలజీ ఆన్ స్క్రీన్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ జత చేశారు. ప్రస్తుతం మంచు మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు, మనోజ్ ఇద్దరూ తీవ్రస్థాయిలో ఘర్షణ పడుతున్నారు. చాలా కాలంగా ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు ఇటీవల కాస్త రోడ్డెక్కాయి. దీంతో ఒకరి మరొకరి విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కన్నప్ప సినిమా పై మంచు మనోజ్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే తన పోస్టులో మంచు విష్ణు పేరును మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు.

మంచు మనోజ్ ట్వీట్.. 

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..