OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న మల్టీస్టారర్.. రికార్డ్ క్రియేట్ చేస్తున్న భైరవం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల వచ్చిన మల్టీస్టారర్ సినిమా భైరవం. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్ అందుకుంది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న మల్టీస్టారర్.. రికార్డ్ క్రియేట్ చేస్తున్న భైరవం..

Updated on: Jul 22, 2025 | 12:51 PM

ఎప్పటిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో ప్రేక్షకుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న జీ5 ..దేశంలోని ఓటీటీ మాధ్య‌మాల్లో ప్రత్యేక‌త‌ను చాటుకుంటూనే ఉంది. దేశంలో వ‌న్ ఆప్ ది బిగ్గెస్ట్ ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన జీ5 ఇప్పుడు భైర‌వం సినిమాతో ఆక‌ట్టుకుంటోంది. మే 30న థియేట‌ర్స్‌లో విడుద‌లై ప్రేక్షకుల‌ను మెప్పించిన ‘భైర‌వం’ మూవీ జీ5లో జూలై 18 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సిల్వ‌ర్ స్క్రీన్‌పై అల‌రించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 100 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో భైర‌వం సినిమా ఆడియెన్స్‌ను అల‌రిస్తోంది.

బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్‌, మంచు మ‌నోజ్ ప్రధాన పాత్రల్లో న‌టించారు. ఆనంది శంక‌ర్‌, దివ్యా పిళ్లై, ఆనంది కీల‌క పాత్రల్లో మెప్పించారు. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఓ గ్రామంలోని ముగ్గురు స్నేహితుల మ‌ధ్య న‌డిచే క‌థ‌ ఇది. గ్రామానికి చెందిన ఆల‌య భూముల‌పై ఓ రాజ‌కీయ నాయ‌కుడు క‌న్నేస్తాడు. అత‌ను వాటి కోసం ఏం చేశాడు ?. ముగ్గురి స్నేహితుల జీవితాలు ఎలా మ‌లుపు తిరిగాయ‌నేదే భైర‌వం క‌థ‌. స్నేహం, ల‌వ్, ఎమోష‌న్స్ ప్రధాన అంశాలుగా తెర‌కెక్కిన ఈ సినిమా వంద మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించ‌టం విశేషం.

ఇవి కూడా చదవండి: Shopping Mall : షాపింగ్ మాల్ సినిమాలో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఇప్పుడేం చేస్తుందంటే..

ఇవి కూడా చదవండి

ఈ చిత్రానికి హరి కె వేదాంతం సినిమాటోగ్రఫర్‌గా, శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా, చోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా పని చేశారు. జూలై 18 జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ‘భైరవం’ చిత్రాన్ని తప్పక చూడండి.

ఇవి కూడా చదవండి: Damarukam movie: ఢమరుకం మూవీ విలన్ గుర్తున్నాడా.. ? అతడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్..

Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..

Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..

Telugu Cinema: టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‏గా.. ఎవరంటే..

Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..