టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంట్లో ఆస్తి వివాదాలు నెలకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబుకు తన తనయుడు మంచు మనోజ్ మధ్య గొడవ జరిగిందని.. ఇద్దరు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారంటూ ఆదివారం ఉదయం వార్తలు వినిపించాయి. మనోజ్ తీవ్రగాయాలతో వచ్చి మరీ తన తండ్రి మీద కంప్లైంట్ చేశారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై మంచు మోహన్ బాబు ఫ్యామిలీ స్పందిస్తూ.. తమ కుటుంబం గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని తెలిపింది. అసత్య ప్రచారాలను ప్రచారం చేయొద్దన్నారు.
అయితే తాజాగా మంచు మనోజ్ బంజారాహిల్స్ లోని ప్రైవేట్ ఆసుపత్రులో చేరారు. కాలికి గాయం కావడంతో హాస్పిటల్‌లో చేరినట్లు తెలుస్తోంది. మనోజ్ ను ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన వెంట భార్య భూమా మౌనికతోపాటు మరికొంత మంది ఆసుపత్రికి వచ్చి మనోజ్ ను అడ్మిట్ చేశారు. కాళ్లకు బలమైన గాయాలు కావడంతో నడవలేని స్థితిలో కనిపిస్తున్నారు మనోజ్. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు..ఈరోజు ఉదయం మోహన్‌బాబు, మంచు మనోజ్ మధ్య వాగ్వాదం జరిగిందని.. ఈ క్రమంలోనే మోహన్‌బాబు అనుచరుడు మనోజ్ పై దాడిచేసినట్టు సమాచారం.
మరోవైపు మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. 1979లో తన గురువు దాసరి నారాయణ రావు తెరకెక్కించిన కోరికలే గుర్రాలైతే సినిమా గురించి తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు మోహన్ బాబు. ఈ చిత్రాన్ని జీ. జగదీశ్ చంద్రప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో ఓ సన్నివేశం తన కెరీర్ లో ప్రత్యేక మైలురాయి అని.. చంద్రమోహన్, మురళిమోహన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సీన్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని.. తొలిసారిగా యమ ధర్మరాజు పాత్ర చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ రాసుకొచ్చారు. ఈ చిత్రంలో ఈ సన్నివేశం తనకు ఓ సవాలుగానూ.. అలాగే సంతోషాన్ని కూడా కలిగించిందని పేర్కొన్నారు.
మోహన్ బాబు ట్వీట్…
Korikale Gurralaithe(1979): Directed by my guru, the legendary Sri. Dasari Narayana Rao garu, and produced by Sri. G. Jagadeesh Chandra Prasad garu, this scene was a special milestone in my career. Sharing the screen with Sri. Chandramohan garu and Sri. Murali Mohan garu made it… pic.twitter.com/sIsJIDRW5C
— Mohan Babu M (@themohanbabu) December 8, 2024
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.