Lakshmi Manchu: మరో ఛాలెంజ్‌ను మొదలుపెట్టిన మంచు లక్ష్మి.. వైరల్ అవుతున్న వీడియో.. ఇంతకు అదేంటంటే..

|

Sep 02, 2021 | 3:36 PM

మంచు ఫ్యామిలీ నుంచి హీరోలతోపాటు మోహన్ బాబు వారసురాలిగా ఎంట్రీ ఇచ్చారు మంచి లక్ష్మిప్రసన్న. హీరోయిన్‌గానే కాదు విలన్‌గానూ నటించి మెప్పించారు లక్ష్మి మంచు.

Lakshmi Manchu: మరో ఛాలెంజ్‌ను మొదలుపెట్టిన మంచు లక్ష్మి.. వైరల్ అవుతున్న వీడియో.. ఇంతకు అదేంటంటే..
Manchu
Follow us on

Lakshmi Manchu : మంచు ఫ్యామిలీ నుంచి హీరోలతోపాటు మోహన్ బాబు వారసురాలిగా ఎంట్రీ ఇచ్చారు మంచి లక్ష్మిప్రసన్న. హీరోయిన్‌గానే కాదు విలన్‌గానూ నటించి మెప్పించారు లక్ష్మి మంచు. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాలో మంత్రగత్తెగా నటించి ఆకట్టుకున్నారు లక్ష్మి. ఆ తర్వాత పలు సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటించారు. ఇక సినిమాలతోనే కాకుండా.. టీవీ షోలతో, టాక్ షోలతోనూ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు ఈ మంచు హీరోయిన్. ఇటీవల ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌ను కూడా మొదలు పెట్టారు. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది మంచు లక్ష్మి. నిత్యం సినిమా అప్డేట్స్‌తోపాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. నెట్టింట పెద్ద ఎత్తున ఫాలోవర్స్  ఉన్న మంచు లక్ష్మి ప్రతి వీడియోకు లక్షల వ్యూస్ వస్తున్నాయి. తాజాగా మేకప్ ఛాలెంజ్ పేరుతో ఆమె ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక నిత్యం రకరకాల ఛాలెంజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కుకింగ్ ఛాలెంజ్ అని, క్లినింగ్ ఛాలెంజ్ అని ఏవోవో వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు కొందరు. తాజాగా మంచు లక్ష్మి కూడా ఓ ఛాలెంజ్‌ను అభిమానుల ముందుకు తీసుకువచ్చారు. తాజాగా మేకప్ ఛాలెంజ్ పేరుతో ఒక వీడియోను షేర్ చేశారు మంచు లక్ష్మి. మగువలు మేకప్ వేసుకోవడానికి గంటల కొద్దీ టైం తీసుకుంటుంటారు. మహిళల మేకప్ పైన చాలా మంది కామెంట్స్ కూడా చేస్తుంటారు. అయితే కేవలం 12 నిమిషాల్లోనే తన మేకప్ ఆర్టిస్టు సాయంతో రెడీ అయ్యారు లక్ష్మి. మొత్తానికి 12 నిమిషాల్లోనే మేకప్ అయినా చాలా అందంగా వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇక మంచు లక్ష్మి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Maa Elections 2021: ‘మా’ ఎన్నికలకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్.. లెక్కలు మారుతున్నాయ్

Allu Arjun : బన్నీ రికార్డ్‌ను కేవలం మూడు రోజుల్లోనే రీచ్ అయన యంగ్ హీరో.. ఏంటా రికార్డు.? అతను ఎవరు.?.

Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు హరిహరవీరమల్లు చిత్రమూనిట్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ..రిలీజ్ ఎప్పుడంటే