
గతేడాది మే నెలలో థియేటర్లలో విడుదలై కమర్షియల్ హిట్ గా నిలిచిన సినిమా మందాకిని. మలయాళంలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఒక కోటి కంటే తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.3 కోట్ల వరకు రాబట్టింది. విభిన్నమైన కథతోపాటు కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. డైరెక్టర్ వినోద్ లీలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనార్కలి మరిక్కర్ కథానాయికగా నటించగా.. అల్తాప్ సమీమ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో కామెడీ టైమింగ్ మరింత హైలెట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా మలయాళ వెర్షన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ఓటీటీలలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
కథ విషయానికి వస్తే..
అరోమల్ (అల్తాఫ్ సలీమ్), అంబిలికి (అనార్కలి మరిక్కర్) ఇద్దరికి పెద్దలు పెళ్లి జరిపిస్తారు. ఫస్ట్ నైట్ రోజే అరోమల్ స్నేహితులు అతడి చేసి మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించాలని ప్లాన్ చేస్తారు. కానీ అనుకోకుండా ఆ కూల్ డ్రింక్ అంబిలి తాగుతుంది. దీంతో తాగిన మత్తులో తన లవ్ ఎఫైర్ గురించి భర్తతో చెబుతుంది. ఫస్ట్ నైట్ రోజే తన భార్య లవ్ ఎఫైర్ గురించి తెలియడంతో అరోమల్ ఏం చేశాడు.. ? చివరకు అరోమల్, అంబిలి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది మందాకిని సినిమా.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..