సినీ ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ మలయాళ డైరెక్టర్ సిద్ధిఖీ (63) గుండెపోటుతో సోమవారం మధ్యాహ్నం కన‍్నుమూసిన సంగతి తెలిసిందే. ఎన్నో హిట్ మువీలు తీసిన సిద్ధిఖీ హఠన్మరణంతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. సోమవారం మధ్యాహ్నం సిద్ధిఖీకి గుండెపోటు రావడంతో కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికే లివర్ సంబంధిత సమస్యలతోపాటు బాధపడుతున్న ఆయనకు న్యూమోనియా ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారు. దీంతో ఈయన ఆరోగ్యం విషమించింది. ఎక్మో సాయంతో ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు ఆయన సన్నిహితులు తెలిపాయి. త్వరలోనే కోలుకుని ఆరోగ్యంగా తిరిగివస్తారని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలేశారు. సిద్ధిఖీ మృతిపట్ల కీర్తి సురేశ్, ప్రభుదేవా, హీరో మోహన్‌లాల్ తదితర తారాగనం సిద్ధిఖీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
దర్శకుడు సిద్ధిఖీ అసలు పేరు సిద్ధిఖీ ఇస్మాయిల్. డైరెక్టర్‌గానే కాకుండా స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్‌గా ఎన్నో సినిమాలకు పనిచేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో హీరో మోహన్‌లాల్‌కు సిద్దిఖీ మంచి స్నేహితులు. వీరి కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌లు అందుకున్నాయి. సిద్దిఖీ డైరెక్షన్‌లో తీసిన తొలి సినిమా ‘రాంజీరావు స్పీకింగ్’లోనూ.. చివరి మువీ ‘బిగ్ బ్రదర్’లోనూ ఈ రెండింటిలోనూ మోహన్‌లాల్ హీరో కావడం మరో విశేషం. వీళ్లిద్దరి బాండింగ్ ఎలాంటి దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు.
— Keerthy Suresh (@KeerthyOfficial) August 8, 2023
RIP Deepest condolences to the family 🙏 pic.twitter.com/LXjkvvxxBl
— Prabhudheva (@PDdancing) August 8, 2023
తెలుగులోనూ సిద్థిఖీ అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో హిట్ లిస్టులో ‘హిట్లర్’ అప్పటికీ ఎప్పటికీ ఓ మైల్‌స్టోన్ లాంటిది. ఈ మువీ కథ సిద్ధిఖీ రాసినదే. హిట్లర్ పేరుతో మలయాళంలో మమ్ముట్టి హీరోగా తీసిన సినిమానే తెలుగులో చిరంజీవి హోరోగా రీమేక్ చేశారు. అలాగే ‘బాడీగార్డ్’ మువీ ఒరిజినల్‌కు దర్శకుడు కూడా సిద్ధిఖీనే. బాడీగార్డ్ మువీ పలు భాషల్లో రీమేక్‌లు తీసిన సంగతి తెలిసిందే. సిద్ధిఖీ డైరెక్షన్‌లో తెలుగులో ‘మారో’ అనే మూవీ కూడా తెరకెక్కించారు. ఈ సినిమాలో నితిన్ హీరోగా చేశాడు. ఐతే ఈ మువీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మారో తర్వాత సిద్దిఖీ మరో తెలుగు సినిమా చేయలేదు. ఇలా తన కెరీర్‌లో సిద్ధిఖీ మొత్తం 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.