హీరోయిన్ సమంత ఇప్పుడు వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో పడింది. తన వరకు వచ్చిన అన్ని ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ తిరిగి బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించి అదుర్స్ అనిపించింది సమంత. తొలిసారి స్పెషల్ సాంగ్ చేసిన సామ్.. తన స్టెప్పులతో.. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే సామ్ ప్రస్తుతం యశోద సినిమా చేస్తుంది.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హరి – హరీష్… ఇద్దరు యువకులు ఈ సినిమాతో దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ మూవీల మరో యంగ్ హీరో కీలక పాత్రలో నటిస్తున్నాడట. మలయాళ హీర ఉన్ని ముకుందన్ యశోద సినిమాలో భాగమయ్యారు. ఇందులో గౌతమ్ పాత్రలో ముకుందన్ కనిపించనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగ ప్రకటించింది. ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ఇది విభిన్నమైన థ్రిల్లర్ కథాంశంతో రూపొందుంతుంది. ఇప్పటివరకు చేయని ఓ సరికొత్త పాత్రలో సమంత కనిపించనుంది. ఇలాంటి సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి నటీనటులు భాగమైనందకు సంతోషంగా ఉందన్నారు.
ట్వీట్..
Extremely talented @Iamunnimukundan joins the world of #Yashoda as #Gautham ❤
A multilingual film ?ing @Samanthaprabhu2 in @krishnasivalenk‘s @SrideviMovieOff banner?@hareeshnarayan @dirharishankar #MynaaSukumar @PulagamOfficial #YashodaTheMovie pic.twitter.com/2K0UqftkfL
— Sridevi Movies (@SrideviMovieOff) December 20, 2021
Samantha: ఇలా కనిపించాలంటే మాత్రం హార్డ్‌వర్క్ కంపల్సరీ.. మరోసారి హాట్ కామెంట్స్ చేసిన సమంత..