సాధారణంగా సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు ఎక్కువగా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. సినిమాల విషయంలో కాదు.. వ్యక్తిగత విషయాలతో నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. ఇక మరికొన్ని సార్లు వారి డ్రెస్సింగ్ విషయంలో ట్రోల్స్ జరుగుతుంటాయి. కేవలం సినీతారలకే కాదు.. వారి కుటుంబసభ్యులపై కూడా ట్రోలింగ్స్ చేస్తుంటారు. తాజాగా మలయాళ స్టార్ నటుడు సురేష్ గోపీ కూతురు భాగ్యను నెట్టింట ఒక ఆకతాయి బాడీ షేమింగ్ చేసి తీవ్రంగా ఆమె మనసు గాయపర్చాడు. అయితే ఆ కామెంట్ పై ఆమె ఘాటుగానే సమాధానమిచ్చింది. భాగ్య ఇచ్చిన కౌంటర్ తో చాలా మంది నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
సురేష్ గోపి కూతురు భాగ్య ఇటీవల కెనడాలోని ఓ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పట్టాను తీసుకున్న సమయంలో దిగిన ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఆ ఫోటోలకు ఒక నెటిజన్.. శుభాకాంక్షలు.. మీరు ఇక పై చీరలు పక్కన పెట్టి వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకోవాలి. ఎందుకంటే లావుగా ఉన్నవారు చీరలు కడితే బాగుండవు. చీరలు మీకు సెట్ కావడం లేదు. వెస్ట్రన్ దుస్తుల్లో మీరు చాలా బాగుంటారు అంటూ కామెంట్ పెట్టాడు. ఇక ఆతడి కామెంట్ కు భాగ్య స్పందిస్తూ.. మీ ఉచిత సలహాకు ధన్యవాదాలు.నా వెయిట్ మీకు సంబంధించిన విషయం అస్సలు కాదు.. కనుక మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాకు నచ్చిన దుస్తులు వేసుకుంటాను. కేరళ సంస్కృతికి తగ్గట్లుగా నేను గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ధరించాను. ఇతరుల మాదిరిగా ఎబ్బెట్టు డ్రెస్ లు వేసుకోలేదు. ఇలాంటి కామెంట్స్ చేయడం మానేసి మీ పనిపై దృష్టి పెడితే బాగుంటుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది.
ఇక భాగ్య ఇచ్చిన రెస్పాన్స్ కు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాడీ షేమింగ్ చేసేవారికి ఇలాంటి సమాధానాలే ఇవ్వాలంటూ ఆమెకు మద్ధతు తెలుపుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.