ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో మాళవిక మోహన్ (Malavika Mohanan) ఒకరు. ఓవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండే ఈ బ్యూటీ.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అయితే సాధారణంగా తమ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చాలావరకు హీరోయిన్స్ చెప్పకుండా మాటే దాటేస్తుంటారు. అలాగే మాళవిక మోహన్ కూడా తన భాయ్ ఫ్రెండ్ గురించి ఆన్సర్ ఇచ్చిన ఓ నెటిజన్‌కు ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది.
ఇటీవల మాళవిక మోహనన్ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చింది. మాల్దివుల ట్రిప్ ఎలా జరిగిందని ప్రశ్నించగా.. సూపర్బ్ అంటూ ఆన్సర్ ఇచ్చింది. అలాగే తనకు ఓ బాంబేకు చెందిన ఓ కంపెనీ.. ఓ గిఫ్ట్ ఇచ్చారని తెలిపింది. అబ్బాయిల షేవింగ్ కిట్ తనకు బహుమతిగా ఇచ్చారని.. అది అబ్బాయిలు ఉపయోగించే బ్రాండ్ కదా.. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ? అని అడగ్గా.. అవును ఉన్నాడు అని చెప్పుకొచ్చింది. దీంతో తన భాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పాలని అడగ్గా.. ఇప్పుడు పోస్ట్ చేసిన వీడియోకు వన్ మిలియన్ అంటే పది లక్షల వ్యూస్ వస్తే.. ప్రమాణ పూర్తిగా నా భాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పెస్తానంటూ కండిషన్ పెట్టింది. ఇక మాళవిక మోహనన్ భాయ్ ఫ్రెండ్ ఎవరో తెలియాలంటే ఆ వీడియోకు పది లక్షల వ్యూస్ రావాల్సిందే.
Ram Gopal Varma: సోషల్ మీడియాలో అప్సరా రాణితో ఆర్జీవి రచ్చ.. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నా అంటూ..