Varasudu: వారసుడు తెలుగు వెర్షన్ విడుదల వాయిదా ? .. క్లారిటీ ఇదే..
విజయ్ దళపతి నటిస్తోన్న వారసుడు చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11న తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీంతో ఈ మూవీ కోసం దళపతి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల వాయిదా పడుతున్నట్లుగా గత రెండ్రోజులుగా

డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ విజయ్ దళపతి.. రష్మిక జంటగా నటిస్తోన్న చిత్రం వరిసు. ఈ సినిమాను తెలుగులో వారసుడు టైటిల్ తో తీసుకువస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీంతో ఈ మూవీ కోసం దళపతి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల వాయిదా పడుతున్నట్లుగా గత రెండ్రోజులుగా వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. డబ్బింగ్ వర్క్స్ ఇంకా పూర్తి కాలేదని.. దీంతో ఈ సినిమా మరో రెండు మూడు రోజులు ఆలస్యంగా అంటే జనవరి 14న విడుదల కానుందని ఫిల్మ్ సర్కిల్లో ప్రచారం నడుస్తోంది. అయితే తాజాగా ఈ విషయంపై మేకర్స్ స్పందించారు.
ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడలేదని.. ముందుగా చెప్పిన ప్రకారమే అంటే జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో వచ్చే పుకార్లను నమ్మోదని చెబుతూ పోస్ట్ పోన్డ్ వార్తలకు చెక్ పెట్టేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి.
మరోవైపు అటు తమిళనాడులో ఇప్పటికే విజయ్ దళపతి.. అజిత్ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి పోటీ పడనున్నాయి. దీంతో చైన్నైలో ఈ ఇద్దరు హీరోల మధ్య పోస్టర్స్, బ్యానర్ల వార్ జరుగుతుంది. మరీ చూడాలి… ఈ సంక్రాంతికి విజయం ఎవరిదో.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
