Super Star Krishna: మరణించీ చిరంజీవి.. ఫలవంతమైన 80 ఏళ్ల జీవితం.. ఇంకేం కావాలంటున్న కృష్ణ ఫ్యాన్స్

ప్రయోజకులైన కొడుకులు..! బుద్దిమంతులైన మనవడు మనవరాళ్లు! చీకూ చింతా లేకుండా గడిపిన చివరి రోజులు ! ఇంతకంటే ఏం కావాలి..? ఓ మనిషి ఫలవంతమైన జీవితం గడిపాడని.. ఆస్వాదించాడని చెప్పడానికి! ఇప్పుడు కృష్ణ విషయంలోనూ ఇదే చెబుతున్నారు కొంత మంది నెటిజెన్లు..

Super Star Krishna: మరణించీ చిరంజీవి.. ఫలవంతమైన 80 ఏళ్ల జీవితం.. ఇంకేం కావాలంటున్న కృష్ణ ఫ్యాన్స్
Super Star Krishna Family

Updated on: Nov 17, 2022 | 7:39 PM

ఒక మనిషి బతకడం అంటే ఏదోలా చచ్చే వరకూ బతకడం కాదు.. మరణించినా పది మంది ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకోవడం.. మనకు ఏ బంధం సంబంధం లేకపోయినా.. అతడు గొప్పవాడురా అంటూ కీర్తించబడడం.. ఇటువంటి వారిని మరణించీ చిరంజీవులు అంటారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు టాలీవుడ్ సూపర్ స్టార్ నట శేఖరుడు సాహసి, భోళా శంకరుడు ఘట్టమనేని శివరామకృష్ణ. అవును ఘణమైన కీర్తి.. ప్రతిష్టలు! లెక్కకుమించిన అభిమాన గణాలు! తీరిన బాధ్యతలు! తన బాటలోనే ప్రయోజకులైన కొడుకులు..! బుద్దిమంతులైన మనవడు మనవరాళ్లు! చీకూ చింతా లేకుండా గడిపిన చివరి రోజులు ! ఇంతకంటే ఏం కావాలి..? ఓ మనిషి ఫలవంతమైన జీవితం గడిపాడని.. ఆస్వాదించాడని చెప్పడానికి! ఇప్పుడు కృష్ణ విషయంలోనూ ఇదే చెబుతున్నారు కొంత మంది నెటిజెన్లు , అభిమానులతో సహా పలువురు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు..

ఎస్ ! నటశేఖరుడిగా.. సూపర్ స్టార్‌గా.. తెలుగు టూ స్టేట్స్‌లో వెలిగిపోయిన కృష్ణ.. తన సినీ జీవితాన్నే కాదు.. పర్సనల్‌ లైఫ్‌ను కూడా సక్సెస్ ఫుల్‌గా లీడ్‌ చేశారు. మొదటి భార్య ఇందిర తో కలిసి ఉంటూనే.. విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరినీ కంటికి పాపలా చూసుకున్నారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్నా.. పిల్లలకు కొంత స్పేస్‌ ఇచ్చి వారితో ఆడుకునే వారు. వారి ఆలనా పాలనా చూసుకుంటూ.. త్రండిగా తన పని కూడా చక్కగా.. పర్ఫెక్ట్ గా చేశారు. తన కూతుళ్లకు మంచి వ్యక్తులనిచ్చి పెళ్లి చేశారు. కొడుకులను సినిమాల్లోకి తీసుకొచ్చి సూపర్ స్టార్లు చేశారు. సినిమాల నుంచి రిటైర్ అయ్యి.. తన ఇంట్లో ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవారు.

అయితే కృష్ణ కళ్ల ముందే పెద కొడుకు రమేష్ బాబు.. ఆ తరువాత కొన్ని రోజులకే తన భార్య ఇందిరా దేవీ మరణించారనే బాధ తప్పా.. చాలా వరకు ఎలాంటి బాధ కష్టం లేకుండానే తన చివరి రోజులు లీడ్‌ చేశారు సూపర్ స్టార్ కృష్ణ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..