AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: ఏమున్నాడ్రా బాబు.. స్టన్నింగ్ లుక్‏లో మహేష్.. లేజర్ ఫోకస్‏లో బాబు..

ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న జక్కన్న మహేష్ ప్రాజెక్ట్ పై మరింత శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే స్క్రీప్ట్ వర్క్ కంప్లీట్ కాగా... ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఇందులో హాలీవుడ్ ఫేమస్ నటీనటులు కనిపించనున్నారని.. ఈ ఏడాది వేసవిలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందని అంటున్నారు. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. జక్కన్న తెరకెక్కించేఈ ఈ ప్రాజెక్టులో మహేష్ మొత్తం ఎనిమిది గెటప్స్ లో కనిపించనున్నారని టాక్.

Mahesh Babu: ఏమున్నాడ్రా బాబు.. స్టన్నింగ్ లుక్‏లో మహేష్.. లేజర్ ఫోకస్‏లో బాబు..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Mar 08, 2024 | 10:53 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇటీవలే జర్మనీ అడవులలో ట్రైనింగ్ తీసుకున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న జక్కన్న మహేష్ ప్రాజెక్ట్ పై మరింత శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే స్క్రీప్ట్ వర్క్ కంప్లీట్ కాగా… ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఇందులో హాలీవుడ్ ఫేమస్ నటీనటులు కనిపించనున్నారని.. ఈ ఏడాది వేసవిలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందని అంటున్నారు. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. జక్కన్న తెరకెక్కించేఈ ఈ ప్రాజెక్టులో మహేష్ మొత్తం ఎనిమిది గెటప్స్ లో కనిపించనున్నారని టాక్. అలాగే ఈ మూవీ కోసం తాను ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యలో చెప్పుకొచ్చారు మహేష్.

ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ న్యూలుక్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. లేజర్ ఫోకస్ అంటూ ఓ కొత్త ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు మహేష్. అందులో క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్ తో అచ్చం హాలీవుడ్ రేంజ్ హీరోగా కనిపిస్తున్నాడు మహేష్. ప్రస్తుతం ఈ ఫోటో చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్. ఎస్ఎస్ఎంబీ 29 కోసమే ఈ లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జక్కన్న తెరకెక్కించే ఈ సినిమాలో మహేష్ పూర్తిగా హాలీవుడ్ హీరోలా కనిపించనున్నారని అంటున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమాను తీసుకువస్తున్నట్లు ఇదివరకే రాజమౌళి వెల్లడించారు.

ఎస్ఎస్ఎంబీ 29 కోసం జక్కన్న మహేష్ బాబుతో మొత్తం ఎనిమిది లుక్స్ ట్రై చేయిస్తున్నారట. ఇప్పటికే అందుకు తగిన డిజైన్స్ జరిగాయని.. అందులో మహేష్ కు ఏది సెట్ అయితే దానిని ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మహేష్ తన ఫ్యాన్స్ ముందుకు రారని.. ఏలాంటి ఈవెంట్స్, ప్రమోషన్లలోనూ పాల్గొనకూడదని జక్కన్న సూచించారట. అయితే ఇందులో ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు