Gunturu Kaaram : గుంటూరు కారం థియేట్రికల్ రైట్స్.. రికార్డ్ ధరకు మహేష్ మూవీ..

గతంలో ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై మరింత అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి రెండేళ్లు పూర్తి కావొస్తుంది. దీంతో ఈ సినిమా కోసం ఓ రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ రికార్డ్ ధరకు కొనుగోలు అయిన సంగతి తెలిసిందే.

Gunturu Kaaram : గుంటూరు కారం థియేట్రికల్ రైట్స్.. రికార్డ్ ధరకు మహేష్ మూవీ..
Guntur Karam Movie

Updated on: Oct 08, 2023 | 9:55 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గుంటూరు కారం. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై మరింత అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి రెండేళ్లు పూర్తి కావొస్తుంది. దీంతో ఈ సినిమా కోసం ఓ రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ రికార్డ్ ధరకు కొనుగోలు అయిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 120 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అలాగే వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.155 కోట్లకు క్లోజ్ అవుతాయని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఓ రీజనల్ సినిమాకు ఈ స్థాయిలో రావడం ఓ భారీ రికార్డ్ అని తెలుస్తోంది.

మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో మహేష్ ఫుల్ మాస్ హీరోగా కనిపించనున్నారు. ఇందులో జగపతి బాబు, సునీల్, అజయ్ కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి సాంగ్స్ రిలీజ్ కానున్నాయి. చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ నటిస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో కథానాయికగా ముందుగా పూజా హెగ్డేను అనుకున్నారు. ఆమెపై పలు సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. అయితే కారణం తెలియదు కానీ ఈ సినిమా నుంచి పూజా తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలోకి మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను హారికా హాసిని బ్యానర్ పై నిర్మి్స్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.