Tollywood : ఎవరో గుర్తుపట్టారా.. ? షారుఖ్ ఖాన్ భార్యకు విషెస్ చెప్పిన తెలుగు హీరో సతీమణి.. ఎవరంటే..
ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందులో బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన ఇద్దరు స్టార్స్ భార్యలు ఉన్నారు. ఒకరు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సతీమణి కాగ.. మరొకరు తెలుగు హీరో సతీమణి. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం ఆ త్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ సతీమణి.. నిర్మాత, ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్ పుట్టినరోజు బుధవారం. (అక్టోబర్ 08). ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా సినీతారలు, ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. గౌరీ ఖాన్ వయసు ప్రస్తుతం 55 సంవత్సరాలు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ భార్య, ఒకప్పటి స్టార్ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ గౌరీ ఖాన్ కు శుభాకాంక్షలు తెలిపారు. త్రోబ్యాక్ ఫోటోను పంచుకున్నారు. ఇప్పుడు ఆ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న హీరోయిన్ నమ్రతా శిరోద్కర్. అలాగే షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్. “పుట్టినరోజు శుభాకాంక్షలు. మనం కలిసి గడిపిన అన్ని సమయాలకు… మీకు చాలా ప్రేమ , ఆశీర్వాదాలను పంపుతున్నాను! రాబోయే సంవత్సరం అద్భుతమైనదిగా ఉండాలి, GK! @gaurikhan. (sic)” అంటూ రాసుకొచ్చారు. పైన ఫోటోలో గౌరీ ఖాన్, నమ్రతా, సంగీత బిజ్లానీ ఉన్నారు.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
1993లో మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వెంటనే తామంతా కలిసి క్రూయిజ్‌లో వెళ్లామని నమ్రత అప్పట్లో వెల్లడించారు. ఇదిలా ఉంటే.. మహేష్ బాబుతో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు నమ్రత. ప్రస్తుతం నిర్మాతగా, బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ అయ్యారు.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..








