Sarkaru Vaari Paata: మహేష్ నోట జగనన్న మాట.. నెట్టింట వైరల్ అవుతోన్న ‘సర్కారు వారి పాట’ డైలాగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ మూవీ కోసం మహేష్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Sarkaru Vaari Paata: మహేష్ నోట జగనన్న మాట.. నెట్టింట వైరల్ అవుతోన్న 'సర్కారు వారి పాట' డైలాగ్
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: May 03, 2022 | 10:13 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట'(Sarkaru Vaari Paata). ఈ మూవీ కోసం మహేష్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు మహేష్. దాంతో ఈ సినిమా పైన కూడా అంచనాలు భారీ ఉన్నాయి. ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ తో దూసుకుపోతుంది. ఇప్పుడా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది సర్కారు వారి థియేట్రికల్ ట్రైలర్. బ్రమరాంభ థియేటర్ లో ఫ్యాన్స్ కోలాహలం మధ్య సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు, చిత్ర దర్శకుడు పరశురాం మిగతా టీం సభ్యులు పాల్గొని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కేరింతల మధ్య ట్రైలర్ ని విడుదల చేశారు. ఇక సోషల్ మీడియాలోనూ సర్కారు వారి పాట ట్రైలర్ రివార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఫాస్టెస్ట్ 20 మిలియన్ వ్యూస్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే ట్రైలర్ విషయానికి వస్తే.. మహేష్ బాబు అభిమానులకు పండగ లాంటి సినిమా సర్కారు వారి పాట అని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. హైవోల్టేజ్ యాక్షన్,. గ్రాండ్ విజువ‌ల్స్‌…. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే డైలాగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది సర్కారు వారి పాట ట్రైలర్.”అప్పనేది ఆడ‌పిల్ల లాంటిది సార్.. ఇక్కడెవ‌రూ బాధ్యత గ‌ల తండ్రిలా బిహేవ్ చేయ‌డం లేదు” అని మహేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అలాగేలో మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్ గా కనిపించారు. అదే సమయంలో మాస్ యాక్షన్ తో అదరగొట్టారు. దర్శకుడు పరశురాం మహేష్ బాబుని సరికొత్తగా చూపించి అభిమానులని అలరించారు. మహేష్ బాబు కీర్తి సురేష్ జోడి లవ్లీగా వుంది. టెక్నికల్ గా సర్కారు వారి పాట అత్యన్నత స్థాయిలో వుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ఎస్ థమన్ ట్రైలర్ కోసం చేసిన బీజీఏం స్కోర్ గ్రాండ్ వుంది. విజువల్స్ లావిష్ గా వున్నాయి. సర్కారు వారి పాట ట్రైలర్ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తిని ఇంకా పెంచేసింది. ఇక ఈ ట్రైలర్ లో మహేష్ బాబు వైస్ జగన్ చెప్పిన డైలాగ్ ను చెప్పి ఆకట్టుకున్నారు. తొలి చూపులోనే హీరోయిన్ ప్రేమలో పడిన మహేష్.. ఆమె చేతులు పట్టుకుని ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని అంటాడు. ఇదే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఈ డైలాగ్ చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోనూ ఇదే డైలాగ్ చెప్పారు. ఇప్పుడు మహేష్ ఈ డైలాగ్ చెప్పడం తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ను వాడేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు..

F3 Movie: హాట్ సమ్మర్‌లో నవ్వులు పూయించడానికి రెడీ అవుతున్న ‘ఎఫ్3’.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే

Upasana konidela : 150 వృద్ధాశ్రమాలకు చేయూతనందిస్తున్న రామ్ చరణ్ సతీమణి..