Mahesh Babu: మహేష్‌ బాబు మల్టీప్లెక్స్‌ బిజినెస్‌.. త్వరలో అక్కడ కూడా ‘ఏఎంబీ సినిమాస్‌’ ప్రారంభం

ప్రస్తుతం టాలీవుడ్‌ను ఏలుతోన్న ది టాప్‌ మోస్ట్‌ హీరోల్లో మహేష్ బాబు ఒకరు . పాన్‌ ఇండియా సినిమాలు చేయకపోయినా దేశవ్యాప్తంగా అతనికి క్రేజ్‌ ఉంది. సర్కారువారి పాట సినిమాలో చివరిగా కనిపించిన మహేశ్‌ త్వరలోనే గుంటూరు కారం ఘాటు చూపించేందుకు మన ముందుకు వస్తున్నాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానుంది.

Mahesh Babu: మహేష్‌ బాబు మల్టీప్లెక్స్‌ బిజినెస్‌.. త్వరలో అక్కడ కూడా ఏఎంబీ సినిమాస్‌ ప్రారంభం
Mahesh Babu

Updated on: Sep 16, 2023 | 8:29 PM

ప్రస్తుతం టాలీవుడ్‌ను ఏలుతోన్న ది టాప్‌ మోస్ట్‌ హీరోల్లో మహేష్ బాబు ఒకరు . పాన్‌ ఇండియా సినిమాలు చేయకపోయినా దేశవ్యాప్తంగా అతనికి క్రేజ్‌ ఉంది. సర్కారువారి పాట సినిమాలో చివరిగా కనిపించిన మహేశ్‌ త్వరలోనే గుంటూరు కారం ఘాటు చూపించేందుకు మన ముందుకు వస్తున్నాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానుంది. దీని తర్వాత దర్శకధీరుడు దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే వ్యాపార రంగంలోనూ సక్సెస్‌ అయ్యాడు మహేష్‌ బాబు. హైదరాబాద్‌లో ఏఎమ్‌బీ మల్టీప్లెక్స్‌ పేరిట థియేటర్లు రన్‌ అవుతున్నాయి. త్వరలోనే బెంగళూరులోనూ ఈ మల్టీప్లెక్స్ సేవలు విస్తరించేందుకు రెడీ అయ్యారు మహేష్‌.బెంగళూరులోని గాంధీ నగర్ ప్రాంతంలో మహేష్ బాబు భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. విశేషమేమిటంటే.. ఇంతకుముందు సుప్రసిద్ధ కపాలి థియేటర్‌ ఉన్న ప్రదేశంలోనే మహేష్ బాబు తన మల్టీప్లెక్స్‌ను భారీగా నిర్మిస్తున్నారు. దీని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండగా మరికొద్ది నెలల్లో మల్టీప్లెక్స్‌ ప్రారంభం కానుంది. హైదరాబాద్, చెన్నై నగరాలతో పోలిస్తే బెంగుళూరులో విభిన్న అభిరుచులతో సినీ ప్రియులు ఉన్నారని, ఇప్పుడు వారిని దృష్టిలో ఉంచుకుని బెంగళూరులో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాలని మహేష్‌ ప్లాన్ చేస్తున్నారట.

త్వరలోనే బెంగళూరులో..

కాగా గతంలో బెంగుళూరులో ఎంతో ప్రసిద్ధి చెందిన కపాలి థియేటర్‌ స్థానంలోనే ఏఎంబీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం కానుంది. 49 ఏళ్ల పాటు సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన కపాలి సినిమా థియేటర్‌ కొన్నేళ్ల క్రితమే మూతబడింది. కన్నడతో పాటు ఇంగ్లీషు, తమిళం, తెలుగు సినిమాలు కూడా ఈ థియేటర్‌లో ప్రదర్శించారు. ముఖ్యంగా కన్నడ సూపర్‌ స్టార్ రాజ్‌కుమార్ నటించిన పలు సినిమాలు ఈ థియేటర్‌లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక ఉపేంద్ర దర్శకత్వంలో శివరాజ్ కుమార్ నటించిన ‘ఓం’ సినిమా ఈ థియేటర్‌లో 30 సార్లు రీరిలీజ్ కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

సంక్రాంతికి గుంటూరు కారం..

గుంటూరు కారం సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మీనాక్షి చౌదరి మరో కథానాయిక. జగపతిబాబు, జయరాం, ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృష్ణ, సునీల్, బ్రహ్మానందం, రఘుబాబు, మహేష్‌ అచంట తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్‌. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

జిమ్ లో మహేష్ బాబు.. 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.