Mahesh Babu : బాబోయ్.. ఇంతందంగా ఉందేంట్రా బాబు.. మహేష్ మేనకోడలిని చూశారా..?

కృష్ణ వారసత్వాన్ని ఇండస్ట్రీలో మహేష్ బాబుతోపాటు ఆయన కూతురు మంజుల ఘట్టమనేని కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అనేక సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాగే మంజుల భర్త సైతం సినిమాల్లో నటుడిగా రాణిస్తున్నారు. ఇక ఇప్పుడిప్పుడు కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో తరం ఇండస్ట్రీలో రాబోతుంది. త్వరలోనే మహేష్ తనయుడితోపాటు..

Mahesh Babu : బాబోయ్.. ఇంతందంగా ఉందేంట్రా బాబు.. మహేష్ మేనకోడలిని చూశారా..?
Mahesh Babu
Follow us

|

Updated on: Jun 16, 2024 | 7:46 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇక ఆయన వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు ఇప్పుడు అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే కృష్ణ వారసత్వాన్ని ఇండస్ట్రీలో మహేష్ బాబుతోపాటు ఆయన కూతురు మంజుల ఘట్టమనేని కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అనేక సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాగే మంజుల భర్త సైతం సినిమాల్లో నటుడిగా రాణిస్తున్నారు. ఇక ఇప్పుడిప్పుడు కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో తరం ఇండస్ట్రీలో రాబోతుంది. త్వరలోనే మహేష్ తనయుడితోపాటు.. హీరో సుధీర్ బాబు సైతం సినిమాల్లోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో ఆమె కూతురు.. మహేష్ మేనకోడలు జాహ్నవి స్వరూప్ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు చిన్నారిగా కనిపించిన జాహ్నవి ఇప్పుడు అచ్చం హీరోయిన్ లా కనిపిస్తుంది. తల్లిదండ్రులతో కలిసి ట్రెడిషనల్ వేర్ లో ఎంతో అందంగా కనిపిస్తున్న జాహ్నవి ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మెన కోడళ్లు, మేనల్లుళ్లతో కలిస్తే మహేష్ చాలా చిన్న పిల్లాడిలా మారిపోయి వారితో ఎంజాయ్ చేస్తుంటాడు.

మంజుల ఘట్టమనేని సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ అక్క, బావగా కనిపించారు మంజుల ఘట్టమనేని దంపతులు. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి పోకిరి సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించారు. అలాగే అటు వ్యాపారరంగంలోనూ తమకంటూ మంచి స్థాయిని ఏర్పర్చుకున్నారు. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫ్యామిలీ విషయాలను పంచుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.