
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)క్రేజ్ గురించి ఆయన రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు పండగే .. మహేష్ ను కొత్త లుక్ లో చూడటానికి ఆయన ఫ్యాన్స్ ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటారు. మహేష్ కూడా తన ఫ్యాన్స్ కోసం కొత్త లుక్స్ ట్రై చేస్తూ ఉంటాడు. మహర్షి సినిమా కోసం గడ్డం పెంచి రఫ్ లుక్ లో దర్శనమించారు మహేష్. ఇక రీసెంట్ గా వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో లాంగ్ హెయిర్ తో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే ఇప్పుడు త్రివిక్రమ్ దర్శాత్వంలో చేయబోతున్న సినిమాలో కూడా కొత్త లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ రఫ్ లుక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ న్యూ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
మహేష్ ఈ ఫొటోలో షర్ట్ లేకుండా కనిపించారు. మహేష్ మాములుగా షర్ట్ లేకుండా కనిపించరు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాలో మహేష్ షర్ట్ లేకుండా కనిపించారు. కానీ ఫుల్ బాడీని చూపించకుండా వెనకనుంచి మాత్రమే చూపించారు. తాజాగా వైరల్ అవుతోన్న ఫొటోలో మాత్రం మహేష్ సూపర్ స్టన్నింగ్ గా కనిపిస్తున్నారు. కండలు తిరిగిన బాడీతో మహేష్ కనిపించడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. మహేష్ సతీమణి ఆయన ఫోటోలను షేర్ చేశారు. మహేష్ స్విమింగ్ పూల్ లో ఉన్న పిక్స్ ను షేర్ చేశారు నమ్రత. ఈ ఫోటోలు చూసి త్రివిక్రమ్ సినిమాలో మహేష్ నయా గెటప్ తో అదరగొట్టడం ఖాయం అని అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ ఫోటోల పై నెట్టింట రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూజాకార్యక్రమాలతో మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాను ఏప్రిల్ 28 2023 న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి